YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ఏపీలో బీజేపీ హవా ప్రారంభమైంది : జేసీ

ఏపీలో బీజేపీ హవా ప్రారంభమైంది : జేసీ

ఏపీలో బీజేపీ హవా ప్రారంభమైంది : జేసీ
కడప, సెప్టెంబర్ 14,
టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. శనివారం నాడు కడప జిల్లాలో పర్యటించిన ఆయన.. ఏపీలో బీజేపీ ప్రభంజనం మొదలైందని వ్యాఖ్యానించారు. అయితే ఆ ప్రభంజనం ఎక్కువైనా కావచ్చు.. లేదా తక్కువైనా కావచ్చనని జేసీ చెప్పుకొచ్చారు. అయితే ఇందులో ప్రతిపక్ష నేత చంద్రబాబు పరోక్షపాత్ర ఉందని వ్యాఖ్యానించారు.చంద్రబాబు ఆలోచనలపైనే రాష్ట్రంలో బీజేపీ ఆధారపడి ఉందని.. ప్రధాని మోదీ ఆలోచనలపై ప్రాంతీయ పార్టీలు ఆధారపడి ఉన్నాయని ఆయన తెలిపారు. జమిలి ఎన్నికలతో ప్రాంతీయ పార్టీలు కనుమరుగేనని జేసీ జోస్యం చెప్పారు.  మోదీ ప్రభంజనం వల్లే ఇతర పార్టీలకు చెందిన నేతలు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. ఏపీలో కూడా పలువురు టీడీపీ నేతలు బీజేపీలో చేరారని... చంద్రబాబు చేసిన కొన్ని తప్పులు, మోదీ ప్రవేశపెట్టిన పథకాలే దీనికి కారణమని చెప్పారు. జమిలీ ఎన్నికలను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని... ఆ ఎన్నికలు వస్తే ప్రాంతీయ పార్టీలు మనుగడ సాగించడం కష్టమేనని అభిప్రాయపడ్డారు. ఏడాది తర్వాత ముఖ్యమంత్రి జగన్ 100 రోజుల పాలనపై మాట్లాడతానని చెప్పారు.కాగా జేసీ.. టీడీపీకి టాటా చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దివాకర్ రెడ్డి ఇలా మాట్లాడటం టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. అయితే ఈ వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలు, వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

Related Posts