వెలివేశారంటూ సీఎం సహాయం కోరుతూ చిన్నారి లేఖ వార్తలపై స్పందించిన సీఎం
అమరావతి సెప్టెంబర్ 14,
తమకుటుంబాన్ని గ్రామం నుంచి వెలివేసి వేధిస్తున్నారని అండగా ఉండాలంటూ ప్రకాశం జిల్లా రామచంద్రాపురం గ్రామం నుంచి నాలుగోతరగతి విద్యార్థిని కోడూరి పుష్ప సీఎంకు లేఖ అంటూ దినపత్రికల్లో వచ్చే వార్తలపై రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్మోహన్ రెడ్డి స్పందించారు. దినపత్రికల్లో ఈవార్తను చూసిన ఆయన నేరుగా ప్రకాశం జిల్లా కలెక్టర్ భాస్కర్కు ఫోన్ చేసి ఆరాతీశారు. వెంటనే ఆ గ్రామాన్ని సందర్శించి వివరాలు పూర్తిగా కనుక్కుని, సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.