విప్లవాత్మక మార్పులకు సమయం ఆసన్నం విద్యావ్యవస్థలో సమూల మార్పులు
ప్రతి మండల కేంద్రంలో ఓ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన: విజయసాయిరెడ్డి
అమరావతి సెప్టెంబర్ 14,
ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థలో తమ ప్రభుత్వం సమూల మార్పులు తీసుకురాబోతుందని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యాశాఖ అధికారులందరికీ ఆదేశాలు జారీచేశారని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం ఎంతో మందికి చేయూతనివ్వనుందని, దాని ద్వారానే విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన శనివారం తన ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘గత ప్రభుత్వాలు విద్యావ్యవస్థను సర్వనాశనం చేశాయి. విద్యను కేవలం వ్యాపారంగానే భావించాయి. అనుమతిలేని ప్రైవేటు యాజమాన్యాల చేతిలో విద్యావ్యవస్థను పెట్టి భ్రష్టుపట్టించారు. వాటన్నింటిని మా ప్రభుత్వం సమూలంగా మార్చుతుంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. విద్యాశాఖలో సంస్కరణలు తీసుకురానున్నారు. ప్రతి మండల కేంద్రంలో ఓ ప్రభుత్వ జూనియర్ కళాశాలను నిర్శించాలని నిర్ణయించారు. దీనిపై
ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం ఎంతో మందికి చేయూతనివ్వనుంది. దాని ద్వారానే విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను బోధించేందుకు చర్యలు ప్రారంభించాం. రోడ్డు భద్రతా, పర్యవరణ పరిరక్షణ వంటి అంశాలు ప్రతి తరగతిలో తప్పనిసరి చేయనున్నాం. ఇది వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది’ అంటూ ట్విటర్ పోస్ట్ ద్వారా తెలిపారు.