YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

పైడితల్లి జాతరకు ఏర్పాట్లు

పైడితల్లి జాతరకు ఏర్పాట్లు

పైడితల్లి జాతరకు ఏర్పాట్లు
విజయనగరం సెప్టెంబర్ 14,
ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లమ్మవారి జాతర వైభవంగా నిర్వహించేందుకు విజయనగరం అధికారులు నడుం బిగించారు..విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో అధికారులతో పైడితల్లమ్మవారి జాతరపై సమీక్షా సమావేశాన్ని కలెక్టర్ హరిజవహర్లాల్ నిర్వహించారు .. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు..సిరిమాను సంబరం చూసేందుకు ప్రముఖులు, మంత్రులు ,లక్షలాది భక్తులు వస్తారని తెలిపారు ..గతం కంటే వైభవంగా నిర్వహించాలని , మున్సిపల్,జిల్లా వైద్య శాఖ , పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని  జిల్లా కలెక్టర్ హరి జోహార్ లాల్ ఆదేశించారు .. ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం  ఘనంగా జరిగేందుకు ఎవరైనా సలహాలు సూచనలు ఇస్తే స్వీకరిస్తామని తెలిపారు..జాతర ఏర్పాట్లను పకడ్బందీగా ఉండాలని జిల్లా కలెక్టర్  హరిజవహర్లాల్ తెలిపారు ..

Related Posts