రంపచోడవరంలో మంత్రి అళ్ల నాని పర్యటన
కాకినాడ సెప్టెంబర్ 14,
తూర్పుగోదావరిజిల్లా ఇన్ఛార్జిమంత్రి,వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఆళ్ళనాని రంపచోడవరం నియోజకవర్గం లో పర్యటించారు. ముందుగా రంపచోడవరం మండలంలోని నరసాపురం పీహెచ్సీ ని,తర్వాత రంపచోడవరం ఏరియా ఆసుపత్రిని సందర్శించి రోగులతో మాట్లాడి సదుపాయాల గురించి అడిగి తెలుసు కున్నారు. అనంతరం ఐటీడీయే మీటింగ్ హాల్ లో వైద్యఆరోగ్యశాఖ అధికారులతో రివ్యూ మీటింగ్ లో పాల్గొన్నారు.ఈ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ ఇటీవల వరదల ప్రభావంలో ముంపుకు గురైన గ్రామాల పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, వ్యాధులు ప్రభల కుండా కట్టుదిట్టమైన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని వైద్యఆరోగ్యశాఖఅధికారులకు సూచించారు. గతప్రభుత్యం లో వరదలు సంభవించినప్పుడు బాధితులకు నిత్యావసర సరుకులు అందించడంలో కానీ, సహాయక చర్యలు అందించడంలో కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని, తమ ప్రభుత్వంలో వరాధభాధితులకు నిత్యావసర సరుకులతో పాటుగా ప్రతి కుటుంబానికి 5 వేలు రూపాయలు తక్షణ సహాయంగా అందించామని మంత్రి అన్నారు.