Highlights
- గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలు
- నిఫ్టీ 10400కి ఎగువన,
- సెన్సెక్స్ 34వేలకు చేరువలో
- ముగియడం విశేషం.
దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ఆరంభంలోనే పాజిటివ్‌నోట్‌తో మురిపించిన మార్కెట్లో మిడ్ సెషన్ తరువాత మరింత పుంజుకుని చివరివరకూ అదే జోష్‌ను కంటిన్యూ చేశాయి. గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలతో ముగింపులో దలాల్ స్ట్రీట్‌లో కొనుగోళ్లు మరింత పుంజుకోవడంతో సెన్సెక్స్ 611 పాయింట్ల పుంజుకుని 33,919 వద్ద,నిఫ్టీ 195 పాయింట్లు లాభంతో 10,422వద్ద ముగిశాయి. పీఎస్‌యూ బ్యాంక్స్ పతనం కొనసాగగా ఎఫ్‌ఎంసీజీ, ప్రయివేట్ బ్యాంక్స్ మార్కెట్‌కు భారీ మద్దతునిచ్చాయి. వీటితోపాటు ఐటీ, ఆటో, మెటల్ భారీ లాభాలను ఆర్జించాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఇంట్రా డేలో అత్యధక లాభాలను నమోదు చేశాయి. దీంతో నిఫ్టీ 10400కి ఎగువన, సెన్సెక్స్ 34వేలకు చేరువలో ముగియడం విశేషం.