ఎరువుల కొరత
కొమురం భీమ్ ఆసిఫాబాద్ సెప్టెంబర్ 14,
ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి పెద్ద పీట వేస్తుంటే.. కొమరం బీమ్ అసిఫాబాద్ జిల్లాలో మాత్రం రైతులకు కన్నీళ్లే మిగుతున్నాయి. పంట సాగు మొదలు పెట్టి 2 నెలలు గడుస్తున్నా యూరియా కోత రైతన్న కళ్ళలో మాత్రం పంట పై ఆశలు వదిలేలా చేస్తున్నాయి. గత మూడు రోజుల నుండి రైతన్నలు వ్యవసాయ కమిటీ కేంద్రాల వద్ద బారులు తీరారు. నిద్ర ఆకలి మాని. పంట పొలాలను దక్కించుకునే ప్రయత్నంలో సొమ్మసిల్లి పడిన దాఖలాలు కూడా వున్నాయి. లా ఒకే లోడు లారీ రావడంతో జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న రైతులంతా ఒకే సారి రావడం పూర్తి స్థాయి లో యూరియా సమకూర్చలేకపోతున్నారు. కాలంకి తగిన వర్షం లేకపోవడం దానితో పాటే యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు... ప్రభుత్వం స్పందించి రైతులను కన్నీటి బాధలను తప్పించి త్వరగా రైతుల పరిష్కారం చూపాలని కోతున్నారు.