YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

విద్య వ్యాపారం కాకూడదు - మంత్రి ఆదిమూలపు సురేష్

విద్య వ్యాపారం కాకూడదు - మంత్రి ఆదిమూలపు సురేష్

విద్య వ్యాపారం కాకూడదు - మంత్రి ఆదిమూలపు సురేష్
మార్కాపురం సెప్టెంబర్ 14 
 విద్య వ్యాపారం కాకూడదనేది ప్రభుత్వ లక్ష్యమని అందుకే విద్యకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు.  ప్రయివేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం పట్టణం లోని సెవెన్ హిల్క్ హోటల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో విద్యాశాఖ మంత్రి డాక్టర్ సురేష్ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. విద్య వ్యాపారం కాకూడదనేది ప్రభుత్వ ద్యేయమని బడ్జెట్ లో అధికశాతం నిధులు కేటాయించటంతో  విద్య పట్ల ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి చూపిన శ్రద్ద ను ప్రజలు గమనించారన్నారు. జనవరి లో డి.ఎస్.సీ నిర్వహిస్తామన్నారు. వంద రోజుల పాలనపై ప్రజల్లో సంతృప్తి వ్యక్తమైందంని ఇంకా చేపట్టాలసిన కార్యక్రమాలు అన్ని ప్రజా సంక్షేమంకోసమే ఉంటాయన్నారు.
    రాష్ట్రం లో ఒకే వ్యక్తి పలు విద్యా  సంస్థలు నడిపే  కార్పొరేట్ సంస్థలపై ద్రుష్టి పెడతామన్నారు. అలా కాకుండా సేవాభావం తో విద్యాలయాలు నడిపే వారికి సహకరిస్తామని అన్నారు. పేదరికంతో ఏ ఒక్కరూ విద్యకు దూరం కాకూడదనే అమ్మ ఒడి పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. అమ్మ ఒడి ద్వారా తల్లులకు వచ్చే  నగదు బ్యాంకు ల్లో అప్పులకు, ఇతర అవసరాలకు జమ చేయకుండా నేరుగా తల్లులకు ఇచ్చే విధంగా ఖాతాలు తెరిపిస్తామన్నారు. ప్రయివేట్ పాఠశాలల యాజమాన్యాలు తన దృష్టికి తెచ్చిన విషయాలను పరిసీలించి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఉపాధ్యాయ అవార్డు ల్లో ప్రయివేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు స్థానం కల్పించాలని కోరిన విషయాన్ని పరిశీలిస్తామన్నారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం పలువురు మంత్రి సురేష్ ను ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే కుందురు నాగార్జున రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts