YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ప్రణాళికలు అటక పైకి... ప్రజలు అనారోగ్యాలకు నిధుల కోసం ఎదురు చూస్తున్న అధికారులు

ప్రణాళికలు అటక పైకి... ప్రజలు అనారోగ్యాలకు నిధుల కోసం ఎదురు చూస్తున్న అధికారులు

ప్రణాళికలు అటక పైకి... ప్రజలు అనారోగ్యాలకు నిధుల కోసం ఎదురు చూస్తున్న అధికారులు
మీన వేషాల్లో అధికార ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆది
వేములవాడ  సెప్టెంబర్ 14, 
ప్రణాళికలు రూపొందిస్తే సరిపోదని వాటి అమలుకు సరిపడా నిధులు కూడా మంజూరు చేయాలనే ఆలోచన లేకపోవడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వేములవాడ నియోజకవర్గ ఇంచార్జ్ ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు శుక్రవారం కోనరావుపేట మండలంలో  విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుందని కానీ  వాటిని సక్రమంగా పూర్తి చేయడంలో విఫలం అవుతుందని ఆరోపించారు గ్రామ జ్యోతి ప్రణాళికను రూపొందించిందని అదేవిధంగా గ్రామ జ్యోతి కూడా రూపొందించిందని వీటిలో గ్రామస్తులు గ్రామ పంచాయతీకి వచ్చి తమ 
సమస్యలను విన్నవించి వెళ్లడం వరకు సబబు గానే ఉన్న ఈ సమస్యలను విన్న అధికారులు గ్రామ ప్రజాప్రతినిధులు వాటిని తీర్చేందుకు నిధుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎదురైంది అని అన్నారు ఇప్పటివరకు ఈ రెండు ప్రణాళికలకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడం తెలంగాణ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని అన్నారు ప్రస్తుతం 30 రోజుల ప్రణాళిక పేరుతో ఈ వర్షాకాలం మరో పథకాన్ని ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని కూడా నిధులు లేక అటకెక్కించేందుకు సిద్ధమవుతుందని అన్నారు గత నాలుగు రోజుల క్రితం తాను ఒక స్నేహితుడిని కలిసేందుకు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లగా అక్కడ ఒక నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి తన ఇద్దరు కొడుకులతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడని ఆ ఇద్దరు కొడుకులు కూడా డెంగ్యూ వ్యాధి సోకి ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లలేని స్థితిలో ఈ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపాడు ఇలా గత 15 రోజుల నుండి ఏ ఆస్పత్రిలో చూసిన ప్రజలు తీవ్ర విషజ్వరాలతో బాధపడుతూ చికిత్స చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి గ్రామంలో ఇంటికి ఒకరు ఇద్దరు చొప్పున తీవ్ర విషజ్వరాలతో బాధపడుతు న్నప్పటికీ అధికార ప్రతినిధులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడం సిగ్గుచేటన్నారు ఈ 30 రోజుల ప్రణాళిక కు 30 లక్షల నిధులను వెచ్చిస్తేనే గ్రామాల్లో పరిశుభ్రత నెలకొని దోమలు ఈగల బారి నుండి ప్రజలు బయట పడతారని అలాగే విష జ్వరాలతో బాధపడుతున్న వారందరినీ వెంటనే గుర్తించి వారికి తగిన చికిత్సను అందించాలని డిమాండ్ చేశారు. లేదంటే తాము నిరవధిక సమ్మెను చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు

Related Posts