YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబు స్ర్కిప్టు  చదివిన పవన్ కళ్యాణ్

చంద్రబాబు స్ర్కిప్టు  చదివిన పవన్ కళ్యాణ్

చంద్రబాబు స్ర్కిప్టు  చదివిన పవన్ కళ్యాణ్
తాడేపల్లి సెప్టెంబర్ 14 (న్యూస్  పల్స్):
చంద్రబాబు స్ర్కిప్టు నే ఇంకా పవన్ కళ్యాణ్ చదువుతున్నాడు. పవన్ కళ్యాణ్ సొంతంగా ఎప్పుడు మాట్లాడడం నేర్చుకుంటాడో అర్ధం కాలేదు. సిఎం జగన్మోహన్ రెడ్డి పారదర్శకంగా పాలన చేస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని పొన్నూరు శాసనసభ్యుడు   కిలారి రోశయ్య అన్నారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. 19 చారిత్రాత్మకమైన బిల్లులను సీఎం తీసుకువచ్చారు. అక్షరాస్యత పెంచాలని సీఎం జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారు. ఇవేమీ పవన్ కళ్యాణ్ కు కనిపించడం లేదు. 19 చారిత్రత్మక బిల్లులుపై పవన్ కళ్యాణ్ అధ్యయనం చేయాలి. జనసేన పార్టీ టీడీపీ అనుబంధ పార్టీగా కొనసాగుతోందని అయన అన్నారు. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎందుకు చంద్రబాబు అవినీతి ని ప్రశ్నించలేదు  600లకు పైగా హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన చంద్రబాబును పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. ఉద్దానంకు పవన్ కళ్యాణ్ వెళ్తే అన్ని అన్ని మౌళిక వసతులు కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు మాట తప్పితే జగన్మోహన్ రెడ్డి ఉద్దానంలో 200 పడకల ఆస్పత్రి కట్టిస్తున్నారు. వరదలు వలన ఇసుక పాలసీలో కొంత ఇబ్బంది ఏర్పడింది. ఇసుకలో వేల కోట్లు టీడీపీ నేతలు దోచుకుంటే ఎందుకు పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు. 1.50 వేల కోట్లను చంద్రబాబు అప్పు చేసి దోచుకుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదని అన్నారు. -ఆర్థిక పరిస్థితి బాగోలేక పోయిన సీఎం శ్రీజగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలు 
కొనసాగిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే సిఎం శ్రీ జగన్మోహన్ రెడ్డి నాలుగున్నర లక్షల ఉద్యోగాలు సృష్టించారు. చంద్రబాబు కు పవన్ కళ్యాణ్ రహస్య మిత్రుడు గా పని చేస్తున్నారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ నే పవన్ కళ్యాణ్ చదువుతున్నాడని విమర్శించారు. ఎందుకు పవన్ కళ్యాణ్ తన పార్టీని విస్తరించుకోలేక పోతున్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక  ప్రాజెక్ట్ లు నీటితో నిండి రైతులు సంతోషంగా ఉన్నారు. రైతులను నిర్లక్ష్యం చేసింది చంద్రబాబే. పవన్ కళ్యాణ్ ధైర్యం ఉంటే నిజాయితీగా నిజాలు మాట్లాడాలి. అమరావతి లో భూసేకరణ కు ఒప్పుకోనన్న పవన్ కళ్యాణ్ తరువాత మాట మార్చారు. రాజధాని మార్చుతామని సీఎం శ్రీ జగన్మోహన్ రెడ్డిగాని, శ్రీబొత్స సత్యనారాయణగాని చెప్పారా అని అడిగారు. ఉగాది రోజున 25 లక్షల మందికి ఇల్లు పట్టాలు ఇస్తామన్న సీఎం మాటలు పవన్ కళ్యాణ్ కు వినిపించడం లేదా. ఛలో ఆత్మకూరు కార్యక్రమంలో చంద్రబాబు నవ్వుల పాలయ్యారని అన్నారు. సినిమాల్లో వలే ఎవరో ఇచ్చిన స్ర్కిప్ట్ ను చదివినట్లు చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ ను పవన్ కళ్యాణ్ చదువుతున్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దిగజారడానికి చంద్రబాబు కారణం అనే విషయం పవన్ కు తెలియదా.  లింగమనేని ఇచ్చిన ఇళ్లలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉంటూ జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చెస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు లింగమనేని కామన్ ఫ్రెండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పై పవన్ కళ్యాణ్ చర్చకు రావాలి.  గోడ మీద పిల్లి వాటాన్ని పవన్ కళ్యాణ్ మానుకోవాలని అయన అన్నారు.

Related Posts