YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

క్రియా శీలక రాజకీయాల్లోకి సోనియా

క్రియా శీలక రాజకీయాల్లోకి సోనియా

క్రియా శీలక రాజకీయాల్లోకి సోనియా
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16
కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలం అధ్యక్షురాలిగా వ్యవహ‌రించి రెండు సార్లు పార్టీని అధికారంలోకి తెచ్చిన సోనియాగాంధీ మళ్లీ ఆ పార్టీకి అధ్యక్షురాలుగా తామే అవుతానని ఎపుడూ అనుకోలేదు. 2017 డిసెంబర్లో తాను తప్పుకుని కుమారుడు రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించారు. ఆ తరువాత ఏడాదిన్నర పాటు రాహుల్ గాంధి తాను అనుకున్నట్లుగా చేయాలనుకున్నారు. అయితే వృధ్ధతరం నేతలు, సోనియా కోటరీగా చేరి ఆయన్ని సరిగ్గా పనిచేయనివ్వలేదు. ఇంతలో లోక్ సభ ఎన్నికల్లో ఘోరమైన పరాజయం బహుమతిగా దక్కింది. తాననుకున్నట్లుగా పార్టీని నిర్మించుకోనివ్వలేదన్న బాధతో పాటు, ఎన్నికల్లో ఓడిపోయమన్న ఆందోళన కలసి రాహుల్ గాంధి ఇక తాను కిరీటం నెత్తిన పెట్టుకోలేనంటూ దిగవిడిచేశారు. దాంతో మళ్ళీ సోనియాగాంధి పార్టీ పగ్గాలు అందుకోవాల్సివచ్చింది. ఇది తాత్కాలికం అంటున్నా కూడా సోనియాగాంధీని ఈ బాధ్యతలు వదిలేవి కావని అంతా అంటున్నారు.ఇక సోనియాగాంధి ఇపుడు కార్యరంగంలోకి దిగుతున్నారు. నూరు రోజులు అయిన మోడీ పాలన మీద ఆమె నిప్పులు చెరగడమే కాదు, ఈ సర్కార్ ప్రజలు ఇచ్చిన మెజారిటీని దుర్వినియోగం చేస్తోందని గట్టిగానే విమర్శలు గుప్పించారు. ఈ ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టవు, ప్రజాస్వామ్యం విలువ కూడా తెలియదంటూ హాట్ కామెంట్స్ చేశారు. తాను ప్రజా క్షేత్రంలోకి వస్తానంటూ సోనియా గాంధీ సమరశంఖం పూరించారు. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి వేళ పాదయాత్ర చేపడతానని కూడా ప్రకటించారు. మోడీ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా ఎక్కడికక్కడ కాంగ్రెస్ శ్రేణులు కదలాలని, ముందుకు అడుగు వేయాలని కూడా సోనియా గాంధీ పిలుపు ఇచ్చారు. రానున్న ఏడాది కాలంలో దేశంలో కీలకమైన పలు రాష్ట్రాల్లో అసెంబ్లీలకు ఎన్నికలు ఉన్నాయి. దాంతో పార్టీని రీచార్జ్ చేయాలనుకుని సోనియాగాంధి కొంగు బిగించారని 
అంటున్నారు.కాంగ్రెస్ పార్టీ ఓ ఏనుగులాంటిది. పడిపోయిన ఏనుగును లేపడం ఎవరి తరమూ కాదు, మంచి సీట్లు, ఓట్లు ఇచ్చిన తెలంగాణా, గోవాల్లో కాంగ్రెస్ పరిస్థితి ఇపుడు ఎలా ఉందంటే వీలు చూసుకుని అంతా అధికార పార్టీలోకి ఫిరాయించారనే చెప్పాలి. ఇక కర్నాటకలో ఎంతో రాజీపడి జూనియర్ పార్టనర్ జేడీఎస్ కి సీఎం పోస్ట్ ఇచ్చినా కూడా పార్టీలోని వారే పొగ పెట్టి సర్కార్ని పడగొట్టేసారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నా కూడా ఎపుడు వూడతాయో తెలియదు, అక్కడా కాంగ్రెస్ లొనే వర్గ పోరు ఓ స్థాయిలో ఉంది. రానున్న మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఉనికి కోసం పోరాటం చేస్తోంది. హర్యానాలో బీజేపీ మొత్తం 90 అసెంబ్లీ సీట్లకు గానూ 75 కి పైగా గెలుచుకుంటామని ఛాలెంజ్ చేస్తోంది. బీహార్ లో చూస్తే లాలూ లేని ఆర్జేడీని నమ్ముకుని కాంగ్రెస్ కధ నడుపుతోంది. అక్కడ పోటీ లేని గెలుపు బీజేపీ, నితీష్ లదే నని అంటున్నారు. ఢిల్లీలో కూడా కేజ్రీవాల్ దిగిపోతే కమలం పీఠం ఎక్కుతుందని అంటున్నారు. ఈ విధంగా చూసుకున్నపుడు సోనియా ఎంతవరకూ పార్టీని ఒడ్డుకు చేర్చగలరు అన్నది పెద్ద ప్రశ్నగా ఉంది.

Related Posts