YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

భారీ వర్షాలతో అధికారులు అప్రమత్తం

భారీ వర్షాలతో అధికారులు అప్రమత్తం

భారీ వర్షాలతో అధికారులు అప్రమత్తం
కర్నూలు  సెప్టెంబర్ 16, 
నంద్యాల రెవెన్యూ డివిజన్ ఏరియా నంద్యాల, మహానంది, ఆళ్లగడ్డ, గోస్పాడు, కోయిలకుంట్ల తదితర మండలాల్లో భారీ వర్షం కురవడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. సోమవారం ఉదయం ఈ అంశంపై కుర్నూలు జిల్లా ఇంఛార్జి కలెక్టర్ రవి పట్టన్ శెట్టి నంద్యాల ఆర్డీవో రామకృష్ణా రెడ్డి, డిఎస్పీ చిదానంద రెడ్డి లను, ఇరిగేషన్ , ఆర్ అండ్ బి, హైవే ఇంజనీర్లను, విపత్తుల స్పందన, అగ్నిమాపక శాఖ, మత్స్య శాఖ, రవాణా, ఆర్టీసీ, డీఈఓ, విద్యా శాఖ అధికారులను అలర్ట్ చేసారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రాణ నష్టం జరగకుండా అన్ని సహాయక చర్యలను తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. అన్ని శాఖల జిల్లా, డివిజన్, మండల అధికారులను అయన అప్రమత్తం చేసారు. .అప్రమత్తంగా ఉండండి. వాగులు, వంకలు, నదులును దాటవద్దని సూచించారు. 

Related Posts