YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

కొనసాగుతున్న గాలింపు

కొనసాగుతున్న గాలింపు

కొనసాగుతున్న గాలింపు
కాకినాడ సెప్టెంబర్ 16, 
 పాపికొండ టూర్ లో బోటు ముంపు ప్రమాద ఘటనలో సోమవారం ఉదయం  మరో నాలుగు  మృతదేహాలను వెలికితీసారు. ఎన్డీఆర్ఎఫ్, నేవీ బృందాలు కచ్చులూరు సమీపంలో మృతదేహాలను గుర్తించి యటకు తీశాయి. దీంతో ఇప్పటివరకు వెలికితీసిన మృతదేహాల సంఖ్య 12 కి చేరింది. ఎన్డీఆర్ ఎఫ్, నేవీ సిబ్బంది ఆదివారం  27 మందిని సురక్షితంగా ప్రాణాలతో కాపాడారు. గల్లంతయిన  వారి కోసం రెస్క్యూ టీమ్స్ సోమవారం తెల్లవారుజామునుంచి సహాయక చర్యలు ప్రారంభించాయి.ఆరు అగ్నిమాపక బృందాలు, ఎనిమిది ఐఆర్ బోట్లు, పన్నెండు అస్కా లైట్లు, శాటిలైట్ ఫోన్ల సాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.  రెండు నౌకాదళ హెలికాప్టర్లు రంగంలో వున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో 26 మంది సురక్షితంగా బయటపడ్డారని మంత్రి ఆళ్ల నాని అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ బోటులో మొత్తం 70 మంది వెళ్లినట్లు సమాచారం అందిందన్నారు. తెలంగాణ మంత్రి పువ్వాడ 
అజయ్‌ మాట్లాడుతూ 12 మంది తెలంగాణ వాసులు సురక్షితంగా ఉన్నారని పేర్కొన్నారు. బోటులో ఎంత మంది తెలంగాణవాసులు ఉన్నారో స్పష్టత రాలేదన్నారు. ఏపీ అధికారులు, ప్రజా ప్రతినిధులతో నిరంతరం సంప్రదిస్తున్నామన్నారు. బాధితులు షాక్‌లో ఉన్నారని, కోలుకున్నాక ఇళ్లకి పంపుతామన్నారు.

Related Posts