YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

 కోడెల మరణంపై అనుమానాలు

 కోడెల మరణంపై అనుమానాలు

 కోడెల మరణంపై అనుమానాలు
హైద్రాబాద్, సెప్టెంబర్ 16, 
టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు మృతిపై అనుమానాస్పద కేసు నమోదు చేశామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. మూడు బృందాలతో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. బంజారాహిల్స్ ఏసీపీ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోందన్నారు. కోడెల భౌతిక కాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత ఆయన మృతిపై క్లారిటీ వస్తుందని సీపీ తెలిపారు.కోడెల మృతికి సంబంధించి క్లూస్ టీం, టెక్నికల్ టీం దర్యాప్తు చేస్తున్నాయి. హైదరాబాద్‌లోని కోడెల నివాసానికి చేరుకుని క్లూస్ టీం ఆధారాలు సేకరించే పనిలో పడింది. గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు తెలిపారు. కోడెల కొంతకాలంగా మనస్తాపంతో ఉన్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారని పోలీసులు చెప్పారు. పోస్టుమార్టం నివేదిక తర్వాత కోడెల మృతిపై ప్రకటన చేయనున్నట్లు సమాచారం.అయితే కోడెల ఉరి వేసుకున్నారని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఘటన సమయంలో కోడెల భార్య, కూతురు, వ్యక్తిగత సహాయకుడు ఉన్నారని, తక్షణమే ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. అప్పటికే వైద్యులు మరణించినట్లు నిర్ధారించారన్నారు. ఆయనది హత్యా? ఆత్మహత్యా? అనేది వైద్యుల నివేదిక తర్వాతే నిర్ధారిస్తామన్నారు.

Related Posts