అష్ట సిద్ధులు
*అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకమ్యం, ఈశిత్వం , వశిత్వం – అనే ఎనిమిదీ అష్టసిద్ధులు.*
*1. అణిమ :* *చిన్నరూపము దాల్చుట*
*అణురూప ప్రాణులందు* *పరమాణురూపముగానుండుట(సూక్ష్మరూపము) సుక్ష్మావస్థ లో కూడా భగవంతుడు ఉన్నాడు అని నమ్మి అతనిలో మనస్సును నిలుపుటవల్ల ఈ సిద్ధి వస్తుంది. దీని వల్ల అత్యంత సుక్ష్మఅణువుగా యోగి తనను తానూ మార్చుకొనగలడు.*
*2. మహిమ : పెద్ద రూపము దాల్చుట*
*(ఈ రెండు సిద్దులను, శ్రీ మద్రామాయణ సుందర కాండలో హనుమంతునిలో చుడగలము)*
*విరాడ్రూపముగానుండుట (పెద్దరూపమునుపొందుట) భగవంతుని మహాత్తుని దర్శించగలిగిన సాధకునకు ఈ సిద్ధి వస్తుంది. దీని కారణంగా అతను శివ, కేశవులకు సామానమయిన కీర్తిని పొందగలుగుతాడు*
*3. గరిమ : చాల బరువగుట*
*(తృణా వర్తుని జంపు శ్రీ* *కృష్ణునిలో చూతుము)*
*బ్రహ్మాండాదులకంటే* *బరువుగానుండుట ; ఈ సిద్ధి సాధించిన వారు తమ శరీర బరువును ఈ భూభారమునకు సమానముగా చేయగలరు.*
*4. లఘిమ : తేలికయగుట*
*(నీటి పైన నడచుట, ఆకాశ మార్గమున పోవుట)*
*ఈ సిద్ధి గలవారు తమ శరీరమును దూది కంటే తేలికగా ఉంచగలరు*
*5. ప్రాప్తి : అనుకొన్న స్థాయికి చేరుట. ఈ సిద్ధి ద్వారా కావాలనుకున్నా క్షణములలో శూన్యం నుండికూడా సృజించుకోగలరు*
*6. ప్రాకామ్యము : కోరినది పొందుట. అనేక దివ్య శక్తులు (దూర దర్శనము, దూర శ్రవణము , ఆకాశ గమనము) వారి వశములో ఉంటాయి.*
*7. ఈశత్వం : పంచ భూతాల పై అధికారము సంపాదించుట (ప్రహ్లాదునివలె). ఇంద్రాది దిక్పాలకులను కూడా నియంత్రించగలిగిన అధికారం వస్తుంది*
*8. వశిత్వం : సకల జీవరాశులు వారు చెప్పినట్లుగా ప్రవర్తింప చేయగలిగిన శక్తి. ఇంద్రియములను లోబరచుకొని యిష్టార్ధ సిద్ది నొందుట.*
*ఈ ఎనిమిదింటిని అష్ట సిద్ధులు అందురు. ఎవరు ఈ అష్ట సిద్దులను యోగ మార్గమున పొందగలుగుదురో వారు బ్రహ్మ స్వరూపమును పొందగలరు.*
ఐతే ఈ సిద్ధులు ప్రాప్తించిన వారు ఈ సిద్ధులను ప్రదర్శించుట నిషేదించ బడినది.*