అధికారికంగా కోడెలకు అంత్యక్రియలు
విజయవాడ, సెప్టెంబర్ 17
మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఆదేశించారు. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని గుంటూరు జిల్లా అధికారులకు సీఎస్ సూచనలు చేశారు.ఇటు కోడెలపార్థీవ దేహాన్ని మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి గుంటూరు తరలించారు. అక్కడ పార్టీ కార్యాలయంలో నేతలు, కార్యకర్తల సందర్శనార్థం ఉంచుతారు. సాయంత్రం నరసరావుపేటకు తరలించనున్నారు.. బుధవారం ఉదయం కోడెల శివప్రసాదరావు సొంత గ్రామమైన కండ్లగుంటలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.సోమవారం కోడెల హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన్ను హుటా హుటిన బసవతారకం ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు ఆయన ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.. చివరికి ఆయన కన్నుమూశారు. అనంతరం కోడెల మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్ట్‌మార్టమ్ నిర్వహించారు. పోలీసులు కూడా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.