YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

39.72 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం -  వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి

39.72 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం -  వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి

39.72 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం -  వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 17,
రైతుబంధు పథకం కింద ఈ ఏడాది 56.76 లక్షల మంది రైతులు అర్హులుగా ఉన్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడారు. ఇప్పటి వరకు రూ. 39.72 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం. మిగిలిన రైతులకు చెల్లింపులు ప్రాసెస్‌లో ఉన్నాయన్నారు. గతేడాది రైతుబంధు పథకం కింద రూ.10,505 కోట్లు చెల్లించాం. ఎకరానికి పంటకు రూ. 5 వేల చొప్పున రెండు పంటలకు రూ. 10 వేలు ఇస్తున్నాం.ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద అనేక రకాల షరతులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా రూ. 6 వేలు.. మూడు సార్లు ఇస్తారు. కిసాన్ సమ్మాన్ యోజన కింద రాష్ట్రంలోని 33 లక్షల మంది రైతులను అర్హులుగా నిర్ణయించారు. కానీ 75 వేల మంది రైతులకు రూ. 125 కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చింది.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకంలో షరతుల్లేవు. రాష్ట్రంలో గుంట భూమి ఉన్నా కూడా ఈ పథకం వర్తిస్తోంది. గతేడాది రైతుబంధు పథకం కింద రూ.10,505 కోట్లు చెల్లించాం. రాష్ట్రంలో 92 శాతం మంది సన్న, చిన్నకారు రైతులు ఉన్నారు. వీరిలో మెజార్టీ రైతులు ఆసరా పెన్షన్లకు కూడా అర్హులుగా ఉన్నారు. ఐదు ఎకరాల భూమి ఉంటే రూ. 50 వేలు వస్తున్నాయి. ఆసరా పెన్షన్ కింద 25 వేల దాకా వస్తున్నాయి. దీంతో ఒక్కో రైతుకు సంవత్సరానికి రూ. 75 వేలు చెల్లిస్తున్నాం అని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.

Related Posts