YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

త్వరలో అంగన్వాడీ టీచర్ల సమస్యలను పరిస్కరిస్తా - మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్

త్వరలో అంగన్వాడీ టీచర్ల సమస్యలను పరిస్కరిస్తా - మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్

త్వరలో అంగన్వాడీ టీచర్ల సమస్యలను పరిస్కరిస్తా - మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
హైదరాబాద్, సెప్టెంబర్ 17, 
మహిళలు, శిశువులకు అత్యంత ఉపయోగమరమైన అంగన్వాడీ టీచర్ల సమస్యలపై త్వరలోనే అధికారులతో సమావేశం నిర్వహించి, అధ్యయనం చేసి సీఎం కేసీఆర్ గారి ఆలోచన మేరకు వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తానని గిరిజన, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. మినీ అంగన్వాడీలలో కూడా ఆయాలను ఇచ్చి అక్కడికి వచ్చే వారికి మరింత వసతి కల్పించాలని తెలంగాణ మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ మంత్రిని ఆమే నివాసంలో కలిసి కోరారు.రాష్ట్రంలో 4000 మంది మినీ అంగన్వాడీలలో టీచర్లుగా పని చేస్తున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ పిలిచి ఇప్పటికే రెండుసార్లు వేతనాలు పెంచి మాకెంతో మేలు చేసారని తెలంగాణ రాష్ట్ర మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు వరలక్ష్మి మంత్రితో తెలిపారు. అంగన్వాడీ లతో సమానంగా మినీ అంగన్వాడీ సెంటర్లు పనిచేస్తున్నాయని, అయితే వీటిలో ఆయాలు లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది ఉందని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
మినీ అంగన్వాడీ టీచర్ల సమస్యను త్వరలో పరిష్కరించే ప్రయత్నం చేస్తానని, అప్పటి వరకు అంగన్వాడీలకు వచ్చే పిల్లలను సొంత బిడ్డల్లాగా చూసుకోవాలని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ గారు మహిళలకు మన రాష్ట్రంలో పథకాలు పెట్టి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. అంగన్వాడీ టీచర్లకు ఏ రాష్ట్రంలో లేని విధంగా వేతనాలు ఇస్త్తున్నారని, వసతులు కల్పిస్తున్నారని చెప్పారు. మన మహిళలకు ఇంతటి ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి గారికి ఆ శాఖలో మనం బాగా పనిచేసి పేరు తీసుకొచ్చే విధంగా, దేశంలో మన అంగన్వాడీలను ఉన్నత స్థానంలో నిలిపే విధంగా పనిచేయాలని సూచించారు.అందరివలె బొకేలతో రాకుండా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా పుస్తకాలు, పెన్నులు తీసుకురావడం పట్ల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు వారిని అభినందించారు. తన వద్దకు వచ్చేవారు బొకేలు కాకుండా, విద్యార్ధులకి ఉపయోగపడే పుస్తకాలు, నోట్ బుక్స్, బాగ్స్, పెన్నులు-పెన్సిళ్లు, గిరిజన హాస్టల్ విద్యార్థులకు ఉపయోగపడే దోమ తెరలు, దుప్పట్లు, ఇతర విద్యా సంబంధ వస్తువులు తీసుకురావాలని కోరారు.

Related Posts