సర్కారీ స్కూళ్లో జాయిట్ కలెక్టర్ తనయుడు
విజయనగరం సెప్టెంబర్ 17
ప్రభుత్వ పాఠశాలలు ఈ పేరంటే అందరికీ చిన్నచూపు ..మధ్య ధనిక విద్యార్థి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాల వైపే చూడరు .. ఎంత కష్టపడినా తమ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలకు పంపించాలని నిర్ణయిస్తారు. ఉత్తమ విద్యాభ్యాసం, క్రమశిక్షణ అక్కడే దొరుకుతుందని వారికి నమ్మకం. ప్రభుత్వం ఎన్ని విధానాలు ప్రకటనలు చేసినా నచ్చదు. ప్రభుత్వ విధానాలను చెప్పడమే కాదు ఆచారంలో చూపించాలని విజయనగరం జాయింట్ కలెక్టర్ 2 కూర్మారావు నిరూపించారు. తమ కుమారున్ని కస్పా మున్సిపల్ హైస్కూల్లో తొమ్మిదో తరగతిలో జాయిన్ చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వ పాఠశాల్లో ఉత్తమ విద్యను అందిస్తారని ప్రాంగణాలు బాగుంటాయని మీడియాకు తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో గురించి చెప్పే ముందు తమ పిల్లల్ని జాయిన్ చేసి ఆదర్శంగా నిలవాలని అప్పుడే విద్యార్థులు తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివించేందుకు ముందుకొస్తారని జాయింట్ కలెక్టర్ టూ కూర్మారావు తెలిపారు ... రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఉత్తమమైన విద్యను అందించేందుకు కృషి చేస్తుందని , కార్పొరేట్ స్కూల్స్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు నిలబడుతున్నాయని ఆయన అన్నారు ..ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని ఉన్నత స్థాయిలో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారని తెలియజేశారు.