కళ్యాణ-కర్ణాటకగా హైదరబాద్-కర్ణాటక ప్రాంతం
బెంగళూర్ సెప్టెంబర్ 17
చారిత్రక ప్రాధాన్యత కలిగిన హైదరబాద్-కర్ణాటక ప్రాంతాన్ని ఇకపై కళ్యాణ-కర్ణాటకగా వ్యవహరిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ప్రకటించారు. ఎంతో కాలంగా ప్రజలు కోరుతున్న మేరకు కళ్యాణ-కర్ణాటకగా ఈ ప్రాంతం పేరును మార్చుతున్నట్టు ఆయన వెల్లడించారు. కలబురిగిలో మంగళవారం సీఎం యడియూరప్ప మాట్లాడుతూ కళ్యాణ-కర్ణాటక ప్రాంత సమగ్రాబివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సచివాలయం ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశారు.గుల్బర్గ, బీదర్, రాయచూర్, యాదగిరి, బళ్లారి, కొప్పళ జిల్లాలతో కూడిన ఈ ప్రాంతాన్ని దశాబ్ధాలుగా హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంగానే వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాంతం గతంలో హైదరాబాద్ కేంద్రంగా నిజాం రాజ్యంలో అంతర్భాగంగా ఉండేది. సంస్ధానాల విలీనం అనంతరం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో కర్ణాటకలో కలిసినప్పటికీ ఆరు జిల్లాలతో కూడిన ఈ ప్రాంతాన్ని హైదరాబాద్-కర్ణాటకగానే వ్యవహరిస్తున్నారు.