YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ముఖ్యమంత్రితో ఫాక్సికన్ ఇండియా ఎండీ భేటీ

ముఖ్యమంత్రితో ఫాక్సికన్ ఇండియా ఎండీ భేటీ

ముఖ్యమంత్రితో ఫాక్సికన్ ఇండియా ఎండీ భేటీ
కంపెనీ విస్తరణపై సీఎంకు వివరాలు తెలిపిన సంస్థ ఎండీ
ఎలక్ట్రానిక్ రంగంలో కొత్త అవకాశాలు అంది పుచ్చుకోవడానికి సిద్ధమన్న సీఎం
అమరావతి సెప్టెంబర్ 17 
ఫాక్సికన్ ఇండియా ఎండీ జోష్ ఫాల్గర్ మంగళవారం సచివాలయంలో సీఎం  వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా సంస్థ కార్యకలాపాలను ముఖ్యమంత్రికి వివరించిన ఫాల్గర్, నెల్లూరు జిల్లా శ్రీ సిటీలో ఉన్న కంపెనీ ద్వారా దాదాపు 15 వేల మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు. వారందరికి వృత్తిపరమైన శిక్షణ కూడా ఇచ్చామని చెప్పారు. అదే విధంగా కంపెనీ ఉత్పాదక సామర్థ్యం కూడా పెంచబోతున్నామన్న ఫాక్సికన్ ఇండియా ఎండీ, ప్రస్తుతం నెలకు 35 లక్షల సెల్ఫోన్లు విక్రయిస్తున్నట్లు వెల్లడించారు.  కాగా, ఎలక్ట్రానిక్ రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి   తెలిపారు. రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్ హబ్ గా తీర్చిదిద్దడానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. పెట్టుబడులకు రాష్ట్రం అన్ని విధాల అనుకూల ప్రాంతమన్న ఆయన, ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. ఉత్తమ నైపుణ్యమున్న మానవ వనరులను తయారు చేయడానికి అత్యుత్తమ ప్రమాణాలతో ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మరింత మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే దీని ఉద్దేశమన్న ముఖ్యమంత్రి  వైయస్ జగన్, ఆ దిశలో ఫాక్సికన్ కంపెనీ కూడా ముందుడుగు వేయాలని ఆకాంక్షించారు.

Related Posts