YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

గాంధి భవన్ లో ఘనంగా విలీన దినోత్సవం - జాతీయ జెండా ఎగరేసిన ఉత్తమ్

గాంధి భవన్ లో ఘనంగా విలీన దినోత్సవం - జాతీయ జెండా ఎగరేసిన ఉత్తమ్

గాంధి భవన్ లో ఘనంగా విలీన దినోత్సవం - జాతీయ జెండా ఎగరేసిన ఉత్తమ్
హైదరాబాద్ సెప్టెంబర్ 17
గాంధి భవన్ లో ఘనంగా విలీన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. గాంధి భవన్ ఆవరణలో పిసిసి అద్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జాతీయ జెండా ఎగుర వేసారు.ఈ సందర్బంగా ఉత్తమ్ మాట్లాడుతూ కర్ణాటక .. మహారాష్ట్ర రాష్ట్రాల్లో సెప్టెంబర్17 విలీన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతున్నారని,కేసీఆర్ ఎందుకు సెప్టెంబర్17 విలీన దినోత్సవాన్ని అధికారికంగా జరిపేందుకు జంకుతున్నారని ప్రశ్నించారు.ముస్లింల మెప్పు పొందేందుకు కేసీఆర్ యూ టర్ను తీసుకున్నారని ఎద్దేవా చేశారు.ఉద్యమ సమయంలో అధికారికంగా జరపాలని డిమాండ్ చేసిన కేసీఆర్ .. తాను అధికారంలోకి వచ్చాక ఎందుకు వెనక్కి తగ్గారన్నారు.భవిష్యత్తు తరాలకు ఈ చరిత్రను అందించాల్సిన అవసరం ఉందన్నారు.అనంతరం మాజీ ఎంపీ వీహెచ్ మాటాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ పాత్ర లేదు .. కాంగ్రెస్,కమ్యూనిస్ట్ లదే ఉద్యమంలో కీలక భూమిక అన్నారు.సెప్టెంబర్17 ను బీజేపీ రాజకీయంగా వాడుకోవాలని .. రెచ్చగొడుతొందని విమర్శించారు.యురేనియం తవ్వకాలపై కేసీఆర్ ద్వంద వైఖరి అవలంబిబిస్తున్నాడన్నారు. యురేనియం తవ్వకాలకు ఏ అధికారి వచ్చినా .. ప్రజలు తిరగబడాలి .. తరిమికొట్టాలి .. కాంగ్రెస్ ప్రజల పక్షాన నిలబడుతుందన్నారు. ఈ కార్యక్రమానికి జానారెడ్డి,  వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం, కుసుమ కుమార్ తదితరులు హాజరైనారు.

Related Posts