దర్శిలో హోం మంత్రి పర్యటన
దర్శి సెప్టెంబర్ 17
ప్రకాశం జిల్లా దర్శి లో రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత పర్యటించారు. అగ్నిమాపక కేంద్రం నూతన భవనాన్ని ప్రారంభించారు. హోం శాఖ మాట్లాడుతూ దర్శిలో 2017 మే 4 అగ్నిమాపక కేంద్రం 75 లక్షల రూపాయలతో భవనాన్ని ఏర్పాటు చేసి చేసినట్లు చెప్పారు. అంతేకాకుండా ప్రకాశం జిల్లాలో 13 ఫైర్ స్టేషన్లు ఉండడం జరిగిందని, ఫైర్ సిబ్బంది కొరతపై ముఖ్యమంత్రితో చర్చించి జనవరిలో నోటిఫికేషన్ జరుగుతుందని తెలిపారు. చిన్నారులు అనేక ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఇలాంటి సైబర్ నేరాలు అరికట్టాలంటే ఇబ్బంది వచ్చినప్పుడు వెంటనే 100కు 112కు1812 కాల్ చేస్తే వెంటనే అక్కడికి సిబ్బంది చేరుకోవడం జరుగుతుందని తెలిపారు.