అసెంబ్లీ లో బిల్టు ఫ్యాక్టరీ పై గళమెత్తిన ములుగు ఎమ్మెల్యే సీతక్క
ములుగు సెప్టెంబర్ 18
ములుగు నియోజకవర్గం లోని బిల్ట్ ఫ్యాక్టరీ తెరిపించి కార్మికులను ఆదుకోవాలని బిల్ట్ ఫ్యాక్టరీ గత 5సంవత్సరాలుగా మూతపడి కార్మికులు అప్పుల బాధ తో ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి నెలకొన్న దుస్థితి వుందని ఈ ఫ్యాక్టరీ మూతపడడం వలన 10000మంది కార్మికులు రోడ్డున రోడ్డున పడ్డారని అమె అన్నారు జీవో నె.91 ప్రకారం సంవత్సరానికి 30కోట్లు జీవో నె.2 వ ప్రకారం సంవత్సరానికి 42 కోట్ల రూపాయల రాయితీతో ఇలా 327 కోట్ల రాయితీలతో బిల్టు ఫ్యాక్టరీని తెరిపిస్తామని ముఖ్యమంత్రి చెప్పడం జరిగిందని గత 48 నెలలుగా కార్మికులకు జీతాలు చెల్లించలేదని ఉద్యోగ విరమణ పొందిన కార్మికులకు సెటిల్మెంట్ చెయ్యలేదని సీతక్క అసెంబ్లీ లో ప్రభుత్వాన్ని నిలదీయగా సంబంధిత మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ములుగు ఎమ్మెల్యే సీతక్క సహకారం తో అదే విదంగా లోకల్ వారి సహకారముతో త్వరలోనే బిల్టు ఫ్యాక్టరీ తెరిపిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు