YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

వైసీపీలో చేరిన తోటపై డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

వైసీపీలో చేరిన తోటపై డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

వైసీపీలో చేరిన తోటపై డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు
కాకినాడ, సెప్టెంబర్ 18
తూర్పుగోదావరి జిల్లా టీడీపీ కీలకనేత, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఆ పార్టీకి గుడ్ బై.. ఇటీవలే వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన పార్టీలో చేరి వారం రోజులు గడవక మునుపే పాత గొడవలన్నీ తెరపైకి వచ్చాయి. ఒకప్పుడు జిల్లాలో జరిగిన ‘వెంకటాయపాలెం శిరోముండనం’ కేసులో తోటను కఠినంగా శిక్షించాలని దళితులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం నాడు రామచంద్రపురం మండలం ద్రాక్షారామలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ కాన్వాయ్‌ను దళిత సంఘం నేతలు అడ్డుకున్నారు. తోటను అరెస్ట్ చేసి తీరాల్సిందేనని దళిత సంఘాలు పట్టుబట్టాయి. ఎప్పటికీ నాకు శత్రువే.. ధర్నా చేస్తా : ఈ సందర్భంగా సంఘం నేతలతో ఆయన మాట్లాడుతూ.. త్రిమూర్తులు తమ పార్టీలో చేరినా.. ప్రభుత్వం తరుపున కేసు విషయంలో బాధితులకు సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. అంతటితో ఆగని ఆయన.. తోటపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘తోట త్రిమూర్తులు నిన్నా, ఈరోజు, రేపు కూడా నాకు శత్రువే. వెంకటాయపాలెం శిరోముండనం కేసులో జగన్ ప్రభుత్వం దళితుల పక్షమే వహిస్తుంది. వైసీపీ స్థాపించినప్పట్నుంచి దళితులే పార్టీకి అండగా ఉన్నారు. దళితులను మేం వదులుకోం. ఈ కేసులో ఏదైనా తేడా జరుగుతుందేమో..? అందుకే బాధిత దళితులను ముఖ్రమంత్రి వద్దకు తీసుకువెళతాను. అవసరం అయితే దళితులతో కలిసి రోడ్డుపై ధర్నా చేసేందుకైనా నేను సిద్దమే. పార్టీలోకి ఎందరో వస్తుంటారు.. పోతుంటారు.. మాకు దళితులే ముఖ్యం’ అని పిల్లి చెప్పుకొచ్చారు. డిప్యూటీ సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు అధికార పార్టీలో చర్చనీయాంశమయ్యాయి. పిల్లి వ్యాఖ్యలపై తోట ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

Related Posts