వాస్తవాలు బయటకు వస్తాయనే చానళ్లపై నిషేధం: జీవన్‌రెడ్డి
జగిత్యాల, సెప్టెంబర్ 18
వాస్తవాలు బయటకు వస్తాయనే ప్రభుత్వం చానళ్లపై నిషేధం విధించిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 చానళ్ల ప్రసారాలను నిలిపివేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో ఆ చానళ్లపై నిషేధం తొలగించాలని డిమాండ్ చేశారు.. సీఎం జగన్మోహన్ రెడ్డికి విజ్ఞత అవసరమని జీవన్‌రెడ్డి అన్నారు.