తాగిన మత్తులో పోలీసు జీపులో నిందితుల శృంగారం
ఫ్లోరిడా, సెప్టెంబర్ 18
అమెరికాలో ఓ జంట చేసిన పనికి పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. థామస్, మేగన్ అనే జంట తప్పతాగి హెల్మెట్ కూడా లేకుండా రోడ్డుపై బైక్ నడుపుతుండగా.. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫ్లోరిడాలోని నసావు కౌంటీలో ఈ సంఘటన జరిగింది. వారిద్దరూ తాగి బండి నడుపుతున్నట్టు తెలుసుకున్న అధికారులు వెంటనే అరెస్ట్ చేసి పోలీస్ కారు ఎక్కించారు. కొద్ది సేపటి తరువాత కారెక్కిన పోలీసు అధికారి కారులోని వెనుక సీటులో దృశ్యం చూసి కంగుతిన్నాడు. తాగిన మత్తులో ఉన్న జంట బట్టలు విప్పేసి వెనుక సీట్లో శృంగారం చేసుకుంటున్నారు.పోలీస్ అధికారికి కోపం వచ్చి.. థామస్‌ను బలవంతంగా కారు నుంచి బయటకు లాగగా.. పోలీసు అధికారిని తోసేసి థామస్ పారిపోవడానికి ప్రయత్నించాడు. వేరే అధికారి థామస్‌ను పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. వారిద్దరిపై తాగి నడిపినందుకు గాను వారిద్దరిపై మొదట కేసు నమోదు చేశారు. థామస్ సంకెళ్లతో తప్పించుకోడానికి ప్రయత్నించినందుకు గాను అతడిపై మరో రెండు కేసులు అదనంగా నమోదు చేశారు. కాగా, థామస్ అంతకు ముందే లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారిపై భౌతిక దాడికి పాల్పడినందుకు 45 రోజులు, మేగన్ పెరోల్ ఉల్లంఘనకు పాల్పడినందుకు 65 రోజులు జైలు జీవితాన్ని గడిపారు.