సప్తగిరి ఆసుపత్రిలో అరుదైన శాస్త్ర చికిత్స
జమ్మికుంట, సెప్టెంబర్ 18
జమ్మికుంట పట్టణంలోని సప్తగిరి ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేసి మహిళకు ప్రాణం పోశారు. వివరాల ప్రకారం వీణవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన ఎమ్ సరోజన అనే మహిళ గత 20సంవత్సరాలుగా హెర్నియా వ్యాధితో బాధ పడుతుంది. నిత్యం కడుపు నొప్పితో శారీరక భాద తో పాటు మానసిక వేదనకు గురి అవుతుంది.ఎ పని చేసుకోలేక ఇతరులపై ఆధారపడి జీవనం సాగిస్తుంది. వరంగల్, హైదరాబాద్ నగరాల్లోని పలు ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్తే సర్జరీ చేయాలంటే రెండు లక్షలు ఖర్చు అవుతుందని అక్కడి వైద్యులు తెలపడం తో ఆపరేషన్ కు డబ్బులు లేక దాతలు సహయం కోరకు ఎదురు చూసినా ఫలితం లేక నిస్సహయంగా ఉంది.ఆమేకు చివరకు జమ్మికుంట వైద్యులు దేవుడిగా ఆదుకున్నారు. జమ్మికుంటలోని సప్తగిరి ఆసుపత్రి వైద్యులను సంప్రదించగా, వైద్య పరీక్షలు నిర్వహించి సర్జరీ చేయాలని నిర్ణయించారు. సర్జరీ అయ్యే ఖర్చు తనకు లేదని బాధిత మహిళ తెలుపగా, వైద్య ఖర్చులు అవసరం లేదని, మెడిసిన్ బిల్లు ఇస్తే సరిపోతుందని వైద్యులు భరోసా కల్పించారు. విజయ వంతంగా ఆపరేషన్ పూర్తి చేసి ఆమేకు నరక యాతన నుండి విముక్తి కల్పించారు. ఆపరేషన్ చేసిన వారిలో సప్తగిరి ఆసుపత్రి డాక్టర్ వంశీకృష్ణ, ఎండి లావణ్య, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.