హిందీ భాష పై అమిత్ షా వ్యాఖ్యలు బాధ్యత రాహిత్యం: మర్రి
హైదరాబాద్ సెప్టెంబర్ 18
హిందీ భాష దేశంలో సాధారణ బాషా చేయాలని అమిత్ షా అనడం బాధ్యత రాహిత్యమని మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి,పిసిసి అధికార ప్రతినిధి నిరంజన్ లు పేర్కొన్నారు.బుదవారం గాంధీ భవన్ లో మీడియా సమాశేషం లో వారు మాట్లాడుతూ ఇట్టి విషయమై కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా కు బహిరంగ లేఖ రాయడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే దక్షిణ భారత దేశంలో ఆందోళన మొదలైందని,దక్షిణ-ఉత్తర దేశాల మధ్య అంతరాలున్నాయన్నారు.ఇలాంటి తరుణంలో ఇలాంటి మాటలు మరింత ఆందోళన కలిగిస్తాయన్నారు.చరిత్ర నుంచి అమిత్ షా పాఠాలు నేర్చుకోవాలని వారు హితవు పలికారు.బీజేపీకి సంఖ్య బలం ఉందని అమిత్ షా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని,ఏకాభిప్రాయం లేకుండా ఎలా పడితే అలా మాట్లాడడం సరి కాదన్నారు.