ఆరోగ్యం రంగంపై నిపుణుల కమిటీ సిఫార్సు - ఆమేరకు జీతాలు పెంచాలన్న కమిటీ, అంగీకరించిన ముఖ్యమంత్రి
ప్రతిపాదనలు తయారుచేయాలని అధికారులకు ఆదేశం
అమరావతి సెప్టెంబర్ 18
ఆరోగ్య రంగంలో సంస్కరణలకు సంబంధించి ముఖ్యమంత్రి వైయస్.జగన్కు నిపుణుల కమిటీ బుధవారం నివేదిక సమర్పించింది. తరువాత అయన నివేదికలోని అంశాలపై నిపుణులు కమిటీ, అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసుపై నిషేధానికి కమిటీ సిఫార్సు, ప్రభుత్వ వైద్యులు జీతాలు పెంచాలని కమిటీ సిఫార్సు చెసింది. దాంతో ప్రతిపాదనలు తయారుచేయాలని సీఎం, కొత్తగా వైద్యుల భర్తీకోసం నోటిఫికేషన్ ఇవ్వాలని అన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ విద్యావ్యవస్థల్లో సమూల మార్పులు రావాలి. ఇంజినీరింగ్ అయినా, మెడిసిన్ అయినా వర్క్ ఎక్స్పీరియన్స్ కచ్చితంగా ఉండాలని అన్నారు. ఏ వృత్తివిద్యా కోర్సు తీసుకున్నా.. చివరి ఏడాది వర్క్ ఎక్స్పీరియన్స్తో ఉండాలి. అప్రెంటిస్ అన్నది పాఠ్యప్రణాళికలో ఒక భాగం కావాలి. మన విద్యావ్యవస్థలో ఈ లోపం ఉందని అన్నారు. చదువుకున్నదాన్ని ఏవిధంగా అమల్లో పెట్టాలన్నదానిపై పాఠ్యప్రణాళికలో ఉండాలి. దీనిపై సరైన సూచనలు చేయాలని నిపుణుల కమిటీకి సీఎం సూచన: ప్రభుత్వాసుపత్రుల దశ,దిశ మారుస్తాంమని అన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో సిబ్బంది కొరతలేకుండా, సదుపాయాలు కల్పించగలిగితేనే వ్యవస్థ బతుకుతుంది. రోగులు ఆస్పత్రికి రాగానే వారికి నమ్మకం కలిగించేలా ఉండాలి. బెడ్లు, దిండ్లు, బెడ్షీట్లు, బాత్రూమ్స్, ఫ్లోరింగ్, గోడలు వీటన్నింటినీ కూడామార్చాలి. ఫ్యాన్లు, లైట్లు అన్నీకూడా సరిగ్గా పనిచేయాలి. అవసరమైన చోట ఏసీలు ఏర్పాట చేయాలి. ఈ మార్పులు చేయగలిగితేనే ప్రభుత్వ ఆస్పత్రులమీద ప్రజల దృక్పథం మారుతుంది. మెడికల్కాలేజీల తరహాలో నర్సింగ్ కాలేజీలపైన కూడా పర్యవేక్షణ ఉండాలి. నర్సింగ్విద్యను పటిష్టం చేయాలని అన్నారు. 108, 104 తదితర సేవల్లో వాడుతున్న వాహనాల నిర్వహణకు సమర్థవంతమైన యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలన్న సీఎం, నాడు – నేడు కింద ఆస్పత్రుల్లో చేపట్టనున్న కార్యక్రమాలపై సమీక్ష జరిపారు. అలాగే నెట్వర్క్ ఆస్పత్రుల్లో ప్రమాణాలపై తనిఖీల అంశాన్ని సమీక్షించారు. ఆపరేషన్ చేయించుకున్నవారికి కోలుకునేంత వరకూ విశ్రాంతి సమయంలో రూ.5వేల చొప్పున అలవెన్స్ ఇవ్వాలి. దీర్ఘకాలిక వ్యాదులతో బాధపడుతున్న వారికి ఇస్తున్న పెన్షన్ను విస్తరించడంపై సమావేశంలో చర్చ జరిగింది. ఇతర దీర్ఘకాలిక వ్యాధులను ఒక కేటగిరీ కిందకు తీసుకు వచ్చి వారికీ నెలకు రూ. 5వేలు పెన్షన్ ఇవ్వాలన్న సీఎం, దీనిపై మార్గదర్శకాలు తయారుచేయాలని ఎం ఆదేశించారు.