YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ప్రతీ హిందువు ఆంగ్ల  భాషలో వ్రాసేప్పుడు, మాటాడేప్పుడు, చర్చలు జరిగేప్పుడు  పాటించాల్సిన  కొన్ని విధులు.

ప్రతీ హిందువు ఆంగ్ల  భాషలో వ్రాసేప్పుడు, మాటాడేప్పుడు, చర్చలు జరిగేప్పుడు  పాటించాల్సిన  కొన్ని విధులు.

ప్రతీ హిందువు ఆంగ్ల  భాషలో వ్రాసేప్పుడు, మాటాడేప్పుడు, చర్చలు జరిగేప్పుడు  పాటించాల్సిన  కొన్ని విధులు.
1 . మన వాళ్ళు  ఆంగ్లములో మాటాడేప్పుడు , వ్రాసేప్పుడు వ్రాసేప్పుడు God  fearing  అని వ్రాస్తుంటారు . మన హిందువులు దేవునికి ఎపుడూ భయపడరు . అండపిండ బ్రహ్మాండ మంతటా కొలువై యున్నాడని మన  సనాతన హైందవం చెబుతుంది. దేవుడనే వారు ప్రత్యేకంగా కొలువుతీరి లేరు . అంతటా  ఉన్నాడు.
2 . ఎవరైనా పరమపదించినపుడు  ~RIP~ , ~rest  in  peace~  వంటివి వాడకండి . *Om Shanthi*(ఓం శాంతి ) అనో, *Hariom*(హరి  ఓం) అనో, లేదా *sadgati praapti*(సద్గతి  ప్రాప్తి), *kaivalya praapti* (కైవల్య ప్రాప్తి)  , *jeevanmukti* (జీవన్ముక్తి) , *vishu padam* (విష్ణు పదం) , *vaikuntha padam* (వైకుంఠపదం), *siva padam* (శివ పదం), *kailsa praapti* (కైలాస ప్రాప్తి)  వంటివి మాత్రమే  వ్రాయండి. 
3 . మనం మన పురాణేతిహాసాలు గూర్చి చెప్పేప్పుడు వాటిని mythology  అని  అనకండి . రామాయణం,  మహాభారతం, భాగవతం ఇత్యాదులన్నీ ఇతిహాసాలు . రామ, కృష్ణ, అర్జున, సీత,  ద్రౌపది  వంటి వారంతా చారిత్రాత్మక పాత్రలు.  కల్పిత పాత్రలు కారు . కావున ~mythology~ అనే పదం వాడటమే ధర్మవిరుద్ధం . *Ithihasa* అని అనవచ్చును.
4 . విగ్రహారాధన అనేది తప్పు అని ఏ మాత్రం ఎపుడూ చెప్పకండి . ఈ విగ్రహారాధన అనేది ఏదో విధంగా (పవిత్రమైన గుర్తులు అక్షరాలు  ఇలా) ప్రతీ మతములోనూ వుంది ..idol  , statue  వంటి పదాలు వాడకండి . *Murthy*(మూర్తి ), విగ్రహం వంటి పదాలను యథావిధిగా ఆంగ్లములో  వ్రాయండి. మన దేవాలయంలోని మూర్తులు కేవలం శిలాప్రతిమలు కాదు, కావున అట్టి పదాలు ఉపయోగించకండి .
5 . గణేశుని , హనుమంతుని elephant  god  , monkey  god  వంటివి వాడకండి. అలా వ్రాయడం అనుచితం. *Ganesha* (గణేశుడు) , *Hanuman* (హనుమంతుడు) అని యథావిధిగా వ్రాయండి . 
6 . మన గుడి గోపురాల గూర్చి వ్రాసేప్పుడు prayer  halls  వంటి పదాలతో వ్రాయకండి . అది మంత్రయుక్తంగా దైవాన్ని ఆవాహన చేసి నిలిపిన చోటు, మరి కొన్ని గుడులు స్వామి వారు స్వయంభువులుగా వెలసిన చోట్లు కాబట్టి అవి *Devalayam*(దేవాలయమనే) వ్రాయండి 
7 . మన పిల్లలకు పుట్టిన రోజులు చేసేనాడు .. కాండిల్స్  వెలిగించి, ఆర్పే పద్ధతులు పాటించకండి . మన హిందూ ధర్మం ప్రకారం దీపాన్ని నోటితో ఊదకూడదు .  నిత్యం మనం అగ్ని ఆరాధన చేయాల్సినవారం కాన .. ఇలా నోటితో  ఊదడం, ఆర్పడం వంటివి చేసి,  అపవిత్రం చేయరాదు .  పుట్టిన రోజు నాడు ఎలా జరుపుకోవాలి అనేది  మనకు మన పెద్దలు సవివరంగా చెప్పియున్నారు. వాటిని ఆచరించడానికి ప్రయత్నించండి .
8 . ఆంగ్లములో వ్రాసేప్పుడు spirituality , materialistic  వంటి ఆపదలను వాడకండి. మన హైందవ ధర్మములో ఈ సృష్టిలోని ప్రతీ  ఒక్కటీ పవిత్రం అయినదే. ఈ పదాలు కిరస్తానీయులు ద్వారా మన దేశములోని వచ్చాయి. *Adhyatmikata*(ఆధ్యాత్మికత) , *bhakti*( భక్తి) , *dharmam*(ధర్మం), *karma*( కర్మ)  వంటి పదాలను యథావిధిగానే వ్రాయండి.
9 . భారతీయులకు శాస్త్రవేత్తలు లేరనే అపోహను వదలండి . మన ఋషులు , మునులు మనకు శాస్త్రవేత్తలు. భారతీయ సనాతన ధర్మములో కొన్ని కాలరీత్యా మూఢనమ్మకాలు వచ్చాయేమో గానీ ఆది  నుండీ మన ధర్మములో , ఆచార వ్యవహారాలలో సైన్స్  అనేది మిళితమై యున్నది . ఇది కాదనలేని నిజం . 
10 . మనం ఆంగ్లములో వ్రాసేప్పుడు its  sinful , sin  వంటివి వ్రాయకండి. *Papam*(పాపం) అనే పదాన్ని యథావిధిగా వ్రాయండి. . భారతీయులకు ఉన్నవి రెండే ఒకటి ధర్మమూ , రెండవది అధర్మం. ధర్మాన్ని పాటిస్తే వచ్చేది *punyam*( పుణ్యం), అధర్మాన్ని పాటించితే కర్మ ఫలితం పాపం. 
11 . ఆంగ్లములో ధ్యానం , ప్రాణాయామం గూర్చి వ్రాసేప్పుడు meditation  ,  breathing  exercise  వంటి పదాలను వాడకుండా యథావిధిగా *Dhyanam*(ధ్యానం), *Pranaayama*(ప్రాణాయామ) వంటి పదాలనే వాడండి .
హిందువుగా పుట్టినందుకు గర్వించండి . భారతీయతను పాటించండి . నిన్ను, నీ సంస్కృతిని గౌరవించుకున్ననాడే ఇతరులను నీవు హృదయపూర్వకంగా గౌరవించగలవనే సత్యాన్ని మరువకండి . నిన్ను, నీ ఆచారాల సంప్రదాయాలను కించపరచుకుని ఇతరులను గౌరవిస్తాము అనుకోవడం ఆత్మహత్యాసదృశమే
జయహే హైందవ భారతీ !
 

Related Posts