YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

శనీశ్వరుడు ప్రసన్నుడవాలంటే హనుమంతుడుని పూజించాలి :

హనుమంతుడుని పూజించుట వలన శని భగవానుడి యొక్క ఉనికిచే ఏర్పడే 'ప్రతికూల' ప్రభావాల నుండి ఉపశమనాన్ని పొందవచ్చని విశ్వసిస్తారు. రామాయణంలో, హనుమంతుడు రావణుడి బారి నుండి తనను రక్షించినందుకు కృతజ్ఞతగా, ఎవరైతే హనుమంతుని, ముఖ్యంగా శనివారాలలో, పూజ చేసి ప్రార్థిస్తారో, వారు శనిగ్రహం యొక్క "దుష్ప్రభావాల" నుండి విముక్తులగుదురు, లేదా కనీసం వాటి ప్రభావము తగ్గుతుందని శని హనుమంతునికి ప్రమాణం చేశాడు.
శని భగవానుడు మరియు హనుమంతునడి మధ్య జరిగిన ఇంకొక సంఘర్షణను గూర్చిన కథనం ప్రకారం శని ప్రభావము హనుమంతుడిపై మొదలవుతున్న సూచికగా, ఒకసారి శని హనుమంతుడి భుజాలపై ఎక్కాడు. అప్పుడు హనుమంతుడు తన శరీరాన్ని భారీగా పెంచి, శనిని, తన భుజాలు, పైకప్పు మధ్య పెట్టి బంధించి, నొక్కడం మొదెలెట్టాడట. నొప్పిని భరించలేక శననీశ్వరుడు, తనను విడిచిపెట్టమని పతరి విధాల వేడుకుంటూ, హనుమంతుడి ని ప్రార్థించాడట. తనను విడిచి పెట్టినట్టయితే, ఎవరు హనుమంతుడిని ప్రార్థిస్తారో, వారిపై తన(శని) యొక్క దుష్ప్రభావాలు లేకుండ చేసెదనని శనీశ్వరుడు, హనుమంతుడికి మాట ఇచ్చిన తరువాత శనిని విడిచిపెట్టాడట.
అమావాస్య రోజున కాళీ మాత పూజ చేయాలి.
విష్ణువును, కృష్ణుని రూపంలో ధ్యాన్నిస్తూ 'ఓం నమో నారాయణాయ', 'హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే..' అని జపించాలి.హనుమంతుడిని సర్వోత్కృష్టమైన (అనంతమైన) రూపంలో ధ్యానించాలి. శని, హనుమంతుని వీపుపై, చేరి అతన్ని పట్టి పీడించాలని ప్రయత్నించినప్పుడు, తన బలంఅంతా ఉపయోగించి, ఒక్క విదిలింపుతో శనిని, విసిరి పారేసినప్పుడు సూర్య భగవానుడు, హనుమంతుడిని మెచ్చుకుని, "న్నిన్ను పూజించిన వారికి శని బాధలుండవు" అని దీవించాడట.
శనిత్రయోదశి, శనిజయంతి (పుష్యమాసం, బహుళ అష్ఠమి) మరియు శనిఅమావస్య రోజులలో తిలాభిషేకం చేయాలి.
బ్రాహ్మణునికి నల్ల నువ్వులు దానం చేయాలి.
నల్ల గోవు(కపిల గోవు)కు బెల్లం మరియు నువ్వుల మిశ్రమాన్ని తినిపించాలి.
శనివారాలలో (శ్రావణ మాసంలో తప్పనిసరిగా) ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉపవాసం ఉందాలి.
కాకులకు ఉదయం, మధ్యాహ్న వేళాలలో అన్నం పెట్టాలి.
వికలాంగులైన వారికి ఆహారం అందివ్వాలి.
నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలి.
శని క్షేత్రాలు సందర్శించాలి.
ప్రతిరోజూ సూర్యాస్తమయం తరువాత ఇంటి ముఖద్వారం వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.
దశరథ మహారాజ కృత శని స్తోత్రమును పఠించాలి.
శ్రావణ పూర్ణిమ నాడు, జ్యేష్టాదేవికి, శనీశ్వరుడికి కళ్యాణం జరిపించాలి.
మూలమంత్రం, పునర్చరణ, హవనం, దానములతో పాటుగా 19000 సార్లు శనిజపం చేయటం మంచిది.
శ్రావణమాసలో, శనివారాలలో శనైశ్వరవ్రతం, హోమం చేయటం చాలా మంచిది.
శనైశ్వర దీక్ష, శ్రావణ శుద్ధ విదియ నుండి శ్రావణ బహుళ షష్ఠి వరకు పూనాలి.
'రామ నామం', హనుమాన్ చాలీసా, దుర్గా స్తుతులను జపించటం.
హనుమంతుడు, శ్రీ దుర్గా దేవి, వినాయకులను ప్రార్థించటం ఎంతో మంచిది.
పెరుగన్నం, దేవునికి నైవేద్యంగా పెట్టిన ఆతరువాత కాకులకు పెట్టాలి.
అనాథ బాలలకు అన్నదానం చేయాలి.
పై వాటిలో ఏది పాటించినా శని ప్రసన్నుడవుతాడు.

Related Posts