YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

కాళేశ్వరం ద్వారా 45 లక్షల ఎకరాలకు నీళ్లు: సీఎం కేసీఆర్

కాళేశ్వరం ద్వారా 45 లక్షల ఎకరాలకు నీళ్లు: సీఎం కేసీఆర్

కాళేశ్వరం ద్వారా 45 లక్షల ఎకరాలకు నీళ్లు: సీఎం కేసీఆర్
హైదరాబాద్ సెప్టెంబర్ 19, 
ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గురువారం  శాసనసభలో కేసీఆర్ మాట్లాడుతూ ఈ మధ్యే ఎస్సారెస్పీనీ కాళేశ్వరం నీళ్లు ముద్దాడాయన్నారు. ఎస్ఆర్ఎస్పీ వరద కాల్వనే రిజర్వాయర్గా మార్చాలని ఆలోచించినం. ఆలోచనను అమలులోకి తీసుకువచ్చి విజయవంతగా పూర్తి చేసామని అన్నారు. ఇప్పుడు ఎస్సారెస్పీలో నీటిమట్టం పెరుగుతోందన్నారు. గోదావరి, ప్రాణహిత కలిసిన చోటనే మనకు నీళ్లు ఉన్నాయి. సింగూరు, నిజాంసాగర్, శ్రీరాంసాగర్ నింపుకుంటే మనకు ఎలాంటి సమస్య ఉండదు. ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ మ్యాన్ మేడ్  రివర్ లాంటిదని అయన అన్నారు. ఎస్సారెఎస్పీ ఆయకట్టు రైతులు ఆందోళన చెందొద్దన్నారు. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు పాత ఆయకట్టు 7 లక్షల ఎకరాలుకు సాగునీరు స్థిరీకరణ జరిగిపోయింది. ఎస్ఆర్ఎస్పీ దగ్గర టూరిజం ప్రాజెక్టు రావాల్సి ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు నవంబర్ నెలలో కూడా 40 టీఎంసీల నీళ్లొస్తున్నాయని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అతి త్వరలో తన లక్ష్యాన్ని చేరుకుంటుందన్నారు. కోదాడ వరకు కాళేశ్వరం నీళ్లు వెళ్తాయన్నారు. కాళేశ్వరం నుంచి 44, 45 లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తామన్నారు. తుమ్మడిహట్టి ప్రాజెక్టుతో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామని అయన అన్నారు.  

Related Posts