YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

పాత బస్తీకి మెట్రో రైలు - సభలో మంత్రి కేటీఆర్

పాత బస్తీకి మెట్రో రైలు - సభలో మంత్రి కేటీఆర్

పాత బస్తీకి మెట్రో రైలు - సభలో మంత్రి కేటీఆర్
హైదరాబాద్ సెప్టెంబర్ 19, 
గురువారం తెలంగాణ శాసనసభలో ప్రశ్నోత్తరాలు కొనసాగింది. హైదరాబాద్ మెట్రోపై కాంగ్రెస్ సభ్యుడు శ్రీధర్ బాబు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. హైదరాబాద్ మెట్రో లో ప్రతి రోజు 3 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. 66 కిలోమీటర్స్ డిసెంబర్ వరకు పూర్తి అవుతుంది. చెన్నయ్ లో 44 కిలోమీటర్స్ పూర్తి చేయడానికి 9 సంవత్సరాలు పట్టింది. మెట్రో మినిమం రేట్ 10 మాక్సిమామ్ 60 రూపాయలని మంత్రి అన్నారు. టీఎస్ఆర్టీసీ బస్సుల కంటే మెట్రో ఛార్జీలే తక్కువ.  దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందిన మెట్రో హైదరాబాద్ మెట్రో అని అన్నారు. కాంగ్రెస్ హయాంలో మెట్రోరైలు ప్రాజెక్టుపై 370 కేసులున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత వచ్చిన తరువాత  సీఎ కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకుని రెండేళ్లలోనే 360 కేసులు పరిష్కరించారని అన్నారు. సామాన్యూలు  అపోహలకు గురి చేసిలా శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. మెట్రో రైలు ప్రాజెక్టుపై అపోహలు సృష్టించడం మానుకోవాలి. ప్రపంచం లో అత్యదునిక హంగులతో ఉన్నది మన మెట్రో. ప్రైవేట్ పబ్లిక్ భాగ్యస్వామ్య సంస్థ అని వెల్లడించారు. గత ప్రభుత్వం ఇచ్చిన విధంగా కాంట్రాక్ట్ నడుస్తుంది. మేము ఎలాంటిది మార్చలేదు.  శ్రీధర్ బాబు ఎప్పుడు కూడా మెట్రో ఎక్కలేదు అందుకే ఎలాంటి సదుపాయాలు ఉన్నాయో తెలియదని అన్నారు  ఓల్డ్సిటీకి ఖచ్చితంగా మెట్రోరైలు వస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ మెట్రోకు 80 గ్లోబల్ అవార్డులు వచ్చాయి. గతంలో 
గన్ పార్క్  పడగొడుతూ మెట్రోరైలు ప్రాజెక్టు డిజైన్ చేశారు. అమరవీరుల స్థూపానికి నష్టం జరగకుండా మెట్రోమార్గాన్ని తెలంగాణ ప్రభుత్వం మార్పులు చేసిందని మంత్రి గుర్తు చేసారు.

Related Posts