YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

సింగరేణి సిబ్బందికి బొనస్ ప్రకటించిన సీఎం కేసీఆర్

సింగరేణి సిబ్బందికి బొనస్ ప్రకటించిన సీఎం కేసీఆర్

సింగరేణి సిబ్బందికి బొనస్ ప్రకటించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్ సెప్టెంబర్ 19, 
సింగరేణి కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా బొనాంజా ప్రకటించారు.  గురువారం నాడు శాసనసభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ సింగరేణిలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేస్తున్నారన్నారు. బొగ్గు ఉత్పత్తిలో కార్మికుల శ్రమ అనిర్వచనీయమన్నారు. ప్రతి ఏడాది బొగ్గు ఉత్పత్తి పెరుగుతోందన్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థలో 50.47 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయగలిగారు. గత ఐదేళ్లలో ప్రతీ ఏడాది బొగ్గు ఉత్పత్తి పెరుగుతూ వస్తుంది. 2018-19 సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి రికార్డు స్థాయిలో 64.41 మిలియన్ టన్నులకు చేరుకున్నదని అయన అన్నారు. ప్రతి ఏటా సింగరేణిలో లాభాలు పెరుగుతున్నాయని, లాభాల్లో కార్మికులకు వాటా పెంచుతామన్నారు. 2017-18లో లాభాల్లో కార్మికులకు 27 శాతం వాటా ఇచ్చామని, ఈ ఏడాది లాభాల్లో కార్మికులకు 28 శాతం వాటా ఇస్తామన్నారు. ప్రతి కార్మికుడికి రూ.లక్షా 899 బోనస్ ఇస్తామని ప్రకటించారు. గత ఏడాదితో పోలిస్తే.. ఒక్కో కార్మికుడికి 40,530 రూపాయిలు అదనంగా ఇస్తున్నారు.  నాలుగేళ్లుగా సింగరేణి లాభాల బాటలోనే పయనిస్తుందన్నరు. సింగరేణిలో జరుగుతున్న ప్రగతి ప్రభుత్వ పాలన దక్షతకు నిదర్శమన్నరు. ఉమ్మడిరాష్ట్రంలో సింగరేణి కార్మికులను పట్టించుకోలేదన్నరు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో సింగరేణి కార్మికుల సంక్షేమానికి ఎన్నో చర్యలు తీసుకుంటుందన్నారు. ఇది దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు అందిస్తున్న కానుక అని సీఎం అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని స్ఫూర్తిగా తీసుకుని కార్మికులు, సిబ్బంది మరింత అంకితభావంతో పనిచేసి మరిన్ని లాభాలు, విజయాలు సాధించిపెట్టాలని ప్రగాడంగా ఆశిస్తున్నట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.కేసీఆర్ ప్రకటనతో సింగరేణి కార్మికుల్లో సంబరాలు వెల్లువెత్తాయి. 

Related Posts