YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

పాలమూరులో ఎండిపోతున్న  పంటలు

పాలమూరులో ఎండిపోతున్న  పంటలు

పాలమూరులో ఎండిపోతున్న  పంటలు
మహబూబ్ నగర్, సెప్టెంబర్ 19
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అనావృష్ఠి వల్ల కోట్లాది రూపాయల పంటలు రైతన్నలు నష్టపోతున్నారు. మునుగోడు నియోజకవర్గంలోని పలు మండలాలలో వర్షాలు లేని కారణంగా వ్యవసాయ పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయి. రాజకీయపార్టీలు ఎన్నికల హడావుడిలో మునిగితేలుతున్నాయి తప్ప రైతులను పట్టించుకునే పరిస్థితిలో లేకుండా పోయాయి. వ్యవసాయ సీజన్‌లో ప్రారంభంలో కురిసిన వర్షాలు గత రెండు నెలలుగా ముఖం చాటేయడంతో పత్తి, వరి, కంది, జొన్న, ఆముదం పంటలు పూర్తిగా ఎండిపోయాయి. వర్షాలు లేక పత్తి పంటలు కాయదశలో ఎండుతుండటంతో పెట్టిన పెట్టుబడులు మట్టిలోనే కలిసిపోతున్నాయి. వేసిన పంటలకు రావాల్సిన లక్షల రూపాయల ఆదాయాన్ని రైతులు కోల్పోయారు. 24గంటల కరెంటు వల్ల భూగర్భజలాలు అడుగంటిపోతుండటంతో బోర్లు ఎండిపోయి వేసిన వరి పంటలూ ఎండిపోతున్నాయి. వ్యవసాయ బావుల వద్ద పశువులకు, జీవాలకు తాగునీరు లేకుండాపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. గొర్రెల కాపరులు తాగునీరు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. సాగు నీటి ప్రాజెక్టులు లేని ఈప్రాంతంలో రైతులు పూర్తిగా వర్షాదారంపైనే పంటలు పండిస్తున్నారు. వర్షాధారంపైనే పంటలు పండిస్తున్న రైతులకు వేసవి కాలాన్ని తలపించేలా ఎండలు రావడంతో పంటలు ఎండిపోయి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు భారీ వర్షాలు లేక వేసవి కాలాన్ని తలపిస్తుంది. 
మద్నూర్‌ మండలంలో రైతులు వేసిన పంటలు ఎండిపోయి దిక్కుతోచని స్థితి లో కొట్టుమిట్టాడుతున్నారు. గ్రామాలకు వెళ్లిన నాయకులకు, ప్రజాప్రతినిధులకు వర్షాలు లేక తమ పంటలు ఎండిపోతున్నాయని మొరపెట్టుకుంటున్నారు.
మద్నూర్‌ మండలంలో ఈ యేడాది 18వేల హెక్టార్లలో పంటలు సాగు చేశారు. జూన్‌ మొదటి వారంలో వర్షాలు కురియకపోయిన రైతులు ఆలస్యంగా పంటలు సాగు చేశారు. కానీ సకాలంలో వర్షాలు కురియకపోవడంతో వేసిన పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో ఈ యేడాది 9 వేల హెక్టార్లలో సోయా, 3 వేల హెక్టార్లలో పత్తి, వెయ్యి హెక్టార్లలో పెసర, 1600హెక్టార్లలో వరి, 800 హెక్టార్లలో మినుము, 1500 హెక్టార్లలో కంది పంట సాగు చేశారు. ప్రభుత్వం సబ్సీడీపై సోయా విత్తనాలను పంపిణీ చేశారు. పెట్టుబడులు అధికమయ్యాయి. ఎరువులు, పురుగుల మందు లతో పాటు పిచ్చి మొక్కలను తొలగించడానికి వ్యవసాయ కూలీల కోసం వేలాది రూపాయ లు పెట్టుబడులు పెట్టామని దీంతో నష్టపోతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని కొడిచీర, మద్నూర్‌, పెద్ద ఎక్లా రా, ఆవల్‌గావ్‌, చిన్న ఎక్లారా గ్రామ శివారులో రైతులు వేసిన పంటలు ఎండలతో ఎండిపో యి నష్టపోయినట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు లేక 20ఎకరాల్లో వేసిన పంటలు మొలకెత్తక ఎండిపోవడంతో ఆ భూముల్లో ఉన్న పంటలను రైతు తొలగించా రు. ప్రభుత్వం, అధికారులు స్పందించి ఎం డిన పంటలపై సర్వే చేయించాలని రైతులు కోరుతున్నారు.సకాలంలో వర్షాలు కురిస్తేనే రైతులు పంటలు పండిస్తారు. లేదంటే అప్పులిచ్చిన వారు రైతుల ఇంటిచుట్టూ తిరిగితే రైతులు ఎండిపోయిన పంటల చుట్టూ తిరుగుతూ దివాళా తీస్తుంటారు. ఈసంవత్సరం రైతులు తీవ్రంగా నష్టాలను చవిచూస్తుండటంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియ డం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related Posts