YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

15 జిల్లాల్లో భూగర్భ జలాల తగ్గుదల

15 జిల్లాల్లో భూగర్భ జలాల తగ్గుదల

15 జిల్లాల్లో భూగర్భ జలాల తగ్గుదల
హైద్రాబాద్, సెప్టెంబర్ 19, 
రాష్ట్ర వ్యాప్తంగా 15 జిల్లాల్లో భూగర్భ జలాల తగ్గుదల కనిపించగా 16 జిల్లాల్లో స్వల్పంగా పెరుగుదల నమోదయింది. ఆగస్టు నెలలో భూగర్భ జలాల పరిస్థితిపై భూగర్భ జల శాఖ వివరాలు ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లోని 584 మండలాల్లో 857 బావుల్లో భూగర్భ జలాల వివరాలను నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. ఆగస్టు నెల వరకూ రాష్ట్రంలో సాధారణ 
వర్షపాతం 587 మిల్లీమీటర్లు కాగా 2 శాతం తక్కువగా 576 మిల్లీమీటర్లు కురిసినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. భూగర్భ జలాలు మరింత అడుగంటుతున్నాయి. గతేడాది మే నెలలో రాష్ర్ట సగటు భూగర్భజల మట్టం 12.73 మీటర్లు నమోదు కాగా.. ఈ ఏడాది 1.83 మీటర్లు పడిపోయి 14.56 మీటర్లుగా నమోదైంది. మెదక్‌‌లో అత్యధికంగా 26.47 మీటర్లు, ఖమ్మంలో 
అత్యల్పంగా 7.55 మీటర్ల లోతులో భూగర్భ జలం ఉన్నట్టు భూగర్భ జలవనరులశాఖ శనివారం ఓ నివేదికలో వెల్లడించింది. ఈ నీటి సంవత్సరం(జూన్‌‌–మే)లో రాష్ర్టంలో 17శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్లు నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం(905.9 మిల్లీ మీటర్లు) కంటే తక్కువగా 748.4 మి.మీ. నమోదైనట్లు వివరించింది.నాగర్‌కర్నూల్‌ జిల్లాలో అతి 
తక్కువగా 262 మిల్లీమీటర్లు, ఆదిలాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 1144 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. రాష్ట్రంలో భూగర్భ జలాల సగటు లోతు 9.74 మీటర్లు కాగా గత సంవత్సరం ఆగస్టు నెలతో పోలిస్తే ఈ సంవత్సరం 0.39 మీటర్లు పెరిగింది. 34 శాతం తక్కువగా వర్షపాతం నమోదయిన మెదక్‌ జిల్లాలో భూగర్భ జలాల తగ్గుదల 3.80 మీటర్లు కాగా సూర్యాపేట జిల్లాలో 
కేవలం 0.26 మీటర్ల తగ్గుదల కనిపించింది. మహబూబాబాద్‌ జిల్లాలో 0.10 మీటర్ల పెరుగుదల కనిపించగా నాగర్‌కర్నూల్‌ జిల్లాలో అత్యధికంగా 3.77 మీటర్ల పైకి భూగర్భ జలాలు నమోదయ్యాయి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా ఈ జిల్లాలోని చెరువులు నింపటంతో భూగర్భ జలాలు పెరిగినట్టు అధికారులు వివరించారు.హైదరాబాద్‌, జనగామ, నల్లగొండ, సంగారెడ్డి, 
సిద్దిపేట, వికారాబాద్‌, యాదాద్రి జిల్లాల్లో భూగర్భ జలాల వినియోగం పెరగినట్టు వారు తమ నివేదికలో పేర్కొన్నారు. ఆదిలాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, జగిత్యాల, కరీంనగర్‌, ఖమ్మం, కొమరం భీం, మహబూబాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, పెద్దపల్లి, సిరిసిల్ల, సూర్యాపేట, వరంగల్‌ అర్బన్‌ జిల్లాల్లో భూగర్భ జలాల్లో స్వల్పంగా పెరుగుదల కనిపించింది. హైదరాబాద్‌, జనగామ, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, మెదక్‌, మేడ్చల్‌, నల్లగొండ, నిర్మల్‌ జిల్లాల్లో భూగర్భ జలాలు స్వల్పంగా తగ్గినట్టు నివేదికలో తెలిపారు

Related Posts