
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు...
భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 19
జూలూరుపాడు మండలం గత రాత్రి పోలీస్ స్టేషన్ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఏపీ 20 టి సి 5894 బొలెరో వాహనంలో తల్లాడ మండలం అన్నారు. గూడెం గ్రామానికి చెందిన రెడ్డిబోయిన శ్రీను అనే వ్యక్తి సుజాతనగర్ మండలం నర్శింహాసాగర్ గ్రామం నుంచి రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి ఎర్రుపాలెంకు బొలెరో వాహనంలో డ్రైవర్ కొల్ల సత్యనారాయణ ఇద్దరు కలిసి 30 క్వింటాల రేషన్ బియ్యాన్ని లోడ్ చేసుకొని తరలిస్తూడగా , వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో బొలెరో వాహనాన్ని గమనించి పరిశీలించగా అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం వాహనాన్ని అదుపులోకి తీసుకొని వాహనాన్ని సీజ్ చేసి ముగ్గురు పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బాణోత్ మహేష్ తెలిపారు.