YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

నల్గొండ కాంగ్రెస్ లో ఐక్యత రాగం...

నల్గొండ కాంగ్రెస్ లో ఐక్యత రాగం...

నల్గొండ కాంగ్రెస్ లో ఐక్యత రాగం...
నల్గొండ సెప్టెంబర్ 19
నల్గొండ జిల్లా  కాంగ్రెస్ లో ఐక్య త రాగం వినిపిస్తుంది. ఇన్ని రోజులు ఒకరినోకరు తిట్టుకున్న నేతల మధ్య సరికొత్త స్నేహం చిగురించింది. ఒకరు ఔనంటె మరోకరు కాదనే నేతలు ఇప్పుడు మాత్రం అందరిది ఓకే మాట, ఒకే దారి  అంటుంన్నారు.. హుజూర్ నగర్ ఉప ఎన్నిక అభ్యర్థి విషయం లో పార్టీ లో తలెత్తిన వివాదం నల్లగొండ కాంగ్రెస్ నేతలను ఓక్కటి చేసింది. ఎప్పుడూ ఉప్ప నిప్పు గా ఉండె కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,ఉత్తమ్ కుమార్ రెడ్డి ల మధ్య స్నేహం చిగురించింది.  ఉత్తమ్ భార్య పద్మావతి ని హుజూర్ నగర్ ఉప ఎన్నిక బరిలో నిలపడం  పట్ల ఎంపీ రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసారు. పార్టీ లో చర్చించకుండా అభ్యర్థి ని ఎలా ఖరారు చేస్తారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కూడా ఉప ఎన్నిక బరిలో శ్యామల కిరణ్ రెడ్డి ని తెరపైకి తెచ్చారు. అయితే హుజూర్ నగర్ ఉప ఎన్నిక  అభ్యర్థి విషయంలో రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడం పట్ల ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పీసీసీ ఛీఫ్ గెలిచి రాజీనామా చేసిన నియోజకవర్గంలో తన భార్య ను అభ్యర్థి గా ప్రకటించడం లో తప్పేముందంటుంన్నారు ఆ జిల్లా నేతలు. మా జిల్లా రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అధికారం 
మాకుఉంది.  మా జిల్లా రాజకీయాల్లో ఇతర జిల్లా ల వారు వెలుపెడితె ఊరుకోమని హెచ్చరిస్తున్నారు. 
హుజూర్ నగర్ ఉప ఎన్నికలో ఉత్తమ్ పద్మావతి ని గెలిపించి తీరుతామంటుంన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.  ఇన్ని రోజు లు సొంత జిల్లా లో పక్కలో బల్లెం లా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు తనకు మద్దతు ఇవ్వడం తో ఉత్తమ్ ఊపిరి పిల్చుకున్నారు.  జిల్లా నేతలంతా ఓక్కటిగా ఉన్నాం అందరం కలసి పనిచేస్తామని ఐక్యత రాగం వినిపిస్తున్నాయి.  ఉమ్మడి నల్గొండ జిల్లా నేతల వైఖరిలో  మార్పు కాంగ్రెస్ నేతలను  ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే పార్టీ లో మరికొందరి అభిప్రాయం మాత్రం మరోలా ఉంది. రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని టార్గెట్ చేసారు. భవిష్యత్ లో మనను కూడా టార్గెట్ చేస్తారని భావించిన నేతలు అందరు కలసి రేవంత్ రెడ్డి ని ఎదుర్కొవాలనే నిర్ణయానికి  వచ్చారని సమాచారం. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి హుజూర్ నగర్ ఉప ఎన్నిక అభ్యర్థి విషయంలో తలదూర్చడం, తన మద్దతు దారుడి పేరు ప్రకటించడానికి కౌంటర్ గానే ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాఖ్యలని పార్టీ నేతలు అంటున్నారు 

Related Posts