
స్కూల్ బస్ బోల్తాపై మంత్రి సీరియస్
దర్శి సెప్టెంబర్ 19
ప్రకాశం జిల్లా దర్శి-తూర్పు వీరాయపాలెం మధ్యలో అదుపు తప్పి స్కూలు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. విద్యార్థులను దర్శి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అతి వేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు నిర్ధారించారు. బస్సు బోల్తా ఘటనపై మంత్రి పేర్నినాని సీరియస్ అయ్యారు. ఘటనపై మంత్రి విచారణకు ఆదేశించారు. సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని రవాణాశాఖ అధికారులకు మంత్రి ఆదేశించారు. గాయపడ్డ పిల్లల ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్కూల్ బస్లకు ఫిట్నెస్ లేకపోవడం, నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు..