YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

పద్మావతిని గెలిపిస్తాం.. రేవంత్ కు కౌంటరిచ్చిన కోమటిరెడ్డి

పద్మావతిని గెలిపిస్తాం.. రేవంత్ కు కౌంటరిచ్చిన కోమటిరెడ్డి

పద్మావతిని గెలిపిస్తాం..
రేవంత్ కు కౌంటరిచ్చిన కోమటిరెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 19 
నల్గొండ జిల్లా రాజకీయాల పై మాకు పూర్తి అవగాహన ఉంది.  ఎన్నికల్లో పోటీకి మా జిల్లాలో రాజకీయ నేతలు చాలా మంది ఉన్నారు.  30 ఏండ్ల నుంచి పోరాట యోధులు ఉన్నారు.  కార్యకర్తల అభిప్రాయం మేరకు ఉత్తమ్ పద్మావతి ని గెలిపిస్తామని కాంగ్రెస్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. గురువారం అయన తెలంగాణ అసెంబ్లీ దగ్గర మీడియాతో మాట్లాడారు. నిన్న మొన్న పార్టీకి వచ్చిన వారి అభిప్రాయం అవసరం లేదు.  మా జిల్లా రాజకీయాల్లోకి వేరే వాళ్ళ జోక్యం అవసరం లేదు.  కొత్త పేరు ఇప్పటి వరకు నేను, ఉత్తమ్, జానారెడ్డి కి తెలీదు పేరే వినలేదు.  మా జిల్లాలో పక్క జిల్లా నేతల పెత్తనం వద్దు.  కొత్త నేతలు పార్టీకి వచ్చినా వాళ్లకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినా నేను అడగలేదని అన్నారు.  టీపీసీసీ నాకు వస్తే బాగుంటుంది ఇవ్వకపోయినా నేను భాదపడను.  హుజూర్ నగర్ లో ఉత్తమ్ పద్మావతి గెలుస్తారు...జిల్లా నేతలందరం మాట్లాడుకున్నాం.  రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల వల్ల మేము ఒక్కటి కావాలని అనుకున్నామని అన్నారు. ఇతర జిల్లా నేతల సలహాలు మా జిల్లాకు అవసరం లేదని అయన స్పష్టం చేసారు.

Related Posts