పునరావాసం కొనసాగించాలి
కర్నూలు సెప్టెంబర్ 19
గురువారం నాడు జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ నంద్యాల, ఆదోని రెవెన్యూ డివిజన్ లలో ఆకస్మిక వరదల పై జిల్లా అధికారులు, ఆర్డిఓలు, ఎస్ ఈ లు, మునిసిపల్ కమీషనర్ లు, తాశిల్దార్ లు, ఎంపిడిఓ లతో ఈ రోజు మధ్యాహ్నం కర్నూలు కలెక్టరేట్ నుండి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి వరద సహాయక చర్యలను సమీక్షించారు. నంద్యాల, ఆదోని డివిజన్ మండలాల తో పాటు జిల్లా అంతటా వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి. స్థానికంగా ఉండండి. వరద సహాయక చర్యలను కొనసాగించండి. 45 వరద సహాయక పునరావాస కేంద్రాల్లో వరద బాధితులకు సురక్షిత ఆహారం, నీరు సరఫరా, మెడికల్ క్యాంపు లను సమస్య లేకుండా కొనసాగించండని అధికారులను ఆదేశించారు. వరద నీటితో నిండిన చెరువులకు గండి పడకుండా, ప్రజలకు ఎటువంటి ముంపు భయం లేకుండా అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టండఇని ఇరిగేషన్ ఎస్ఈ, అధికారులను ఆదేశించారు. రోడ్డు కట్ అయిన చోట రాకపోకలకు ఇబ్బంది లేకుండా వెంటనే తాత్కాలిక పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండని పీఆర్, ఆర్ అండ్ బి ఎస్ ఈ లను ఆదేశించారు. గాజులపల్లి-మహానంది రోడ్డు, గోస్పాడు మండలం జూలేపల్లి వాగు వద్ద రోడ్డును వెంటనే పునరుద్ధరణ చేయండని అన్నారు. నంద్యాలలో వైద్య విధాన పరిషత్ జిల్లా స్థాయి ఆస్పత్రిలో ఇరవై నాలుగు గంటలు ఔట్ పేషేంట్ ట్రీట్మెంట్ చేయాలని అన్నారు. డిఎంహెచ్ఓ ద్వారా 33 చోట్ల వరద సహాయక మెడికల్ క్యాంపు లు కొనసాగించాలని అన్నారు. విపత్తుల నిర్వహణ సీఆర్ ఎఫ్ కింద ఆర్థిక సాయం కోసం రోడ్లు, చెరువులు, త్రాగునీటి పథకాల పునరుద్ధరణ పనుల ప్రతిపాదనలను, పంట నష్టం, పశు నష్టం వివరాల నివేదికలను సిపిఓ కు పంపండని అన్నారు. టెలీ కాన్ఫెరెన్సు లో పాల్గొన్న జెసి రవి పట్టన్ శెట్టి, జెసి2 సయ్యద్ ఖాజా మోహిద్దీన్, ఆర్డీవో లు, జిల్లా, డివిజన్, మండల అధికారులు పాల్గోన్నారు.