పాకీస్థానీ జీహాద్ అంటూ కశ్మీర్‌లో అడుగుపెడితే.. పాక్ ప్రజలకు ఇమ్రాన్ ఖాన్ హెచ్చరిక
న్యూఢిల్లీ సెప్టెంబర్ 19
జీహాద్ అంటూ పాకిస్థానీలు కశ్మీర్‌లో అడుగుపెడితే అక్కడి వారికి తీరని అన్యాయం చేసినట్టు అవుతుందని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించారు. భారత్‌కు ఒక్క అవకాశం ఇచ్చినా కశ్మీరీలపై ఆంక్షల పేరుతో విరుచుపడుతుందన్నారు. ఎవరైనా పాకీస్థానీ జీహాద్ అంటూ కశ్మీర్‌లో అడుగుపెడితే..అక్కడి వారికి అన్యాయం చేసిన మొదటి వ్యక్తి అతడే అవుతాడు అని ఇమ్రాన్
వ్యాఖ్యానించారు.త్వరలో ఐక్యరాజసమితి జనరల్ అసెంబ్లీ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా కశ్మీర్ అంశాన్ని ఆ ప్రపంచ వేదికిపై ప్రస్తావిస్తానని ఇమ్రాన్ స్పష్టం చేశారు. కశ్మీర్‌లో కర్ఫ్యూకు తెరదించే వరకూ భారత్‌తో చర్చలు జరపబోమని కూడా ఇమ్రాన్ తేల్చిచెప్పారు.