యురేనియంపై కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌వి అవకాశవాద రాజకీయాలు: కిషన్‌రెడ్డి
న్యూఢిల్లీ సెప్టెంబర్ 19
యురేనియంపై కాంగ్రెస్, టీఆర్‌ఎస్ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. యురేనియం అన్వేషణకు అనుమతులు ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. 2016డిసెంబర్ 6న యురేనియం అన్వేషణకు టీఆర్‌ఎస్ సర్కార్ అనుమతిచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వ అనుమతి మేరకే నల్లమలలో యురేనియం అన్వేషణ చేపట్టారని తెలిపారు. ఇప్పుడు వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తూ రాజకీయాలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా ఖనిజ సంపదపై పరిశోధనలు జరుగుతున్నాయని, అన్వేషణకు మాత్రమే అనుమతి ఇచ్చామని, తవ్వకాలకు కాదన్నారు. తెలంగాణలో మాత్రమే యురేనియం తవ్వకాలు చేస్తున్నారంటూ.. బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. యురేనియం కంటే కూడా బొగ్గు తవ్వకంతోనే ఎక్కువ నష్టమని కిషన్‌రెడ్డి చెప్పారు.