YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆరోగ్యం తెలంగాణ

30రోజుల కార్యాచరణపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు మురుగు కాల్వల లో,రోడ్డు పై  చెత్త వేసిన వారిపై జరిమానా 

30రోజుల కార్యాచరణపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు మురుగు కాల్వల లో,రోడ్డు పై  చెత్త వేసిన వారిపై జరిమానా 

30రోజుల కార్యాచరణపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు మురుగు కాల్వల లో,రోడ్డు పై  చెత్త వేసిన వారిపై జరిమానా 
ఇంకుడుగుంతల నిర్మాణం కు ప్రాధాన్యం -  జిల్లా   కలెక్టర్  కృష్ణ భాస్కర్
సిరిసిల్ల, సెప్టెంబర్ 19 
30రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్   అధికారులను హెచ్చరించారు.ప్రజా ప్రతినిధులు, అధికారులు గ్రామ సేవకులుగా పనిచేసినప్పుడే గ్రామాలు సత్వర అభివృద్ధిని సాధిస్తాయని జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్  అన్నారు. గ్రామాల ప్రజలు  సమిష్టిగా  ప్రభుత్వ లక్ష్యాల వంద శాతం  సాధనకు కృషి చేయాలని సూచించారు .గ్రామాలలో పచ్చదనం పెంపుతో పాటు  పారిశుద్ద్యం  మెరుగ్గా ఉండేలా ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్  కోరారు . రానున్న పక్షం రోజుల్లో గ్రామాల రూపు రేఖలు సమూలంగా మారాల్సిందే నని కలెక్టర్ స్పష్టం చేసారు . గురువారం   బోయినిపల్లి  మండలంలోని బూరుగుపల్లి ,కోరెం ,స్థంభం పల్లి  గ్రామాలలో  30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమ అమలును జిల్లా   కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్ క్షేత్ర స్థాయిలో  పరిశీలించారు . 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సందర్భంగా  ఏర్పాటు చేసిన పారిశుద్ధ్య , హరితాహారం , పనులు , విద్యుత్ కమిటీ లు , వాటి పనితీరు , ఇప్పటి వరకు గుర్తించిన పనులు , పూర్తీ చేసిన పనులు , పెండింగ్ పనులు , ప్రతిబంధకాల ను కమిటీ కన్వీనర్ లు , సభ్యులను అడిగి తెలుసుకున్నారు .  . పనుల పూర్తీ కి  పక్షం రోజుల టార్గెట్ గా విధించుకోవాలన్నారు.  గ్రామాల పర్యటన లో పరిశుద్ద్యం , మొక్కల పెంపకం ను పరిశీలించారు. మొక్కల   సంరక్షణ ఎలా ఉంది అని అధికారులను  అడిగారు . నాటిన మొక్కలలో కనీసం 85 శాతం మొక్కలు బ్రతకాల్సిందే అన్నారు . లేదంటే బాధ్యుల పై చర్యలు తప్పవని హెచ్చరించారు . పలు వీదులలో చెత్త పేర్కొని పోవడం , నిర్మాణ సామాగ్రి రోడ్ల పై పోసి ఉండడం, వర్షపు నీరు నిలిసి ఉండడం , మురుగు కాలువలలో ప్లాస్టిక్ వ్యర్దాలు పేర్కొని ఉండడం ,పూడిక తీయక పోవడం ను గుర్తించిన  జిల్లా కలెక్టర్ వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా  గ్రామ కార్యదర్శులను ఆదేశించారు  .  30రోజుల కార్యాచరణ ప్రణాళిక కా ర్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని అన్నారు. పరిశుభ్రత, పచ్చదనంపై ప్రత్యేక దృష్టి సారించాలని, గ్రామాల్లో డ్రైనేజీలు 100శాతం క్లీనింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు విజిలెన్స్ బృందాలు పర్యటించనున్నాయని, ఎక్కడ కూడా నిర్లక్ష్యం జరిగినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన హెచ్చరించారు.

Related Posts