YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

ఉదిత్ నారాయణ్ తనయుడు అరెస్టు

Highlights

  • అంధేరీలో కారుతో రిక్షాను ఢీకొట్టిన ఆదిత్య నారాయణ్
  •  పూచీకత్తుతో బెయిలుపై విడుదల
ఉదిత్ నారాయణ్ తనయుడు అరెస్టు

ఓ రిక్షాను ఢీ కొట్టిన ఘటనలో ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ కుమారుడు ఆదిత్య నారాయణ్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం రూ.10వేల పూచీకత్తుతో  బెయిల్ పై విడుదల చేసారు. ఆదిత్య తన కారులో ప్రయాణిస్తూ అంధేరీ ప్రాంతంలోని లోఖండ్‌వాలా సర్కిల్ వద్ద ఓ రిక్షాను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రిక్షా కార్మికుడు, ఓ ప్రయాణికురాలు తీవ్రంగా గాయపడ్డారు.   కారు యూటర్న్ తీసుకుంటున్న సమయంలో ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్టు చెప్పారు. కాగా, ప్రమాదంలో గాయపడిన రిక్షా కార్మికుడు, ప్రయాణికురాలిని ఆదిత్య వెంటనే కోకిలాబెన్ ధీరుబాయ్ అంబానీ ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. 

Related Posts