YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

అమిత్ షాతో మమత బెనర్జీ భేటీ

అమిత్ షాతో మమత బెనర్జీ భేటీ

అమిత్ షాతో మమత బెనర్జీ భేటీ
న్యూఢిల్లీ సెప్టెంబర్ 19
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గురువారం  ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అస్సాంలో చేపట్టిన ఎన్ఆర్సీ గురించి కేంద్ర మంత్రితో సీఎం బెనర్జీ చర్చించారు.  బెంగాల్లో ఎన్ఆర్సీ చేపట్టాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. అస్సాంలో 19 లక్షల మందిని పౌరుల జాబితా నుంచి తొలగించిన విషయం తెలిసిందే.  ఎన్ఆర్సీ జాబితాలో చోటు దక్కనివారిలో హిందీ, బెంగాలీ, అస్సామీ మాట్లాడే స్థానికులు ఉన్నారన్నారు. నిజమైన ఓటర్లను కూడా కోల్పోయామన్నారు.  దీనికి సంబంధించి షాకు లేఖ అందజేసినట్లు దీదీ తెలిపారు. తరువాత ఆమె మీడియాతో మాట్లాడారు. అమిత్ షా కు ఇచ్చిన లేఖలో ఆర్హుల పేర్లు గల్లంతయ్యాయని పేర్కోన్నారు. దీన్ని సరిచేయాలని సూచించినట్లు ఆమె అన్నారు. బుధవారం దీదీ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే, ప్రధానితో ఆమె కేవలం శాఖపరమైన చర్చలు జరిపారు. ఎన్ఆర్సీ అంశం చర్చకు రాలేదు.

Related Posts