
కారు- డీసీఎం ఢీ నలుగురు మృతి
జనగామ సెప్టెంబర్ 19
జిల్లాలోని దేవరుప్పల మండల కేంద్రంలో ఘోర రోడ్డ ప్రమాదం జరిగింది. కారు- డీసీఎం ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు పెనుగొండ గణేశ్(60), పెనుగొండ సుకన్య(38), ఎండీనజీర్(డ్రైవర్)లుగా గుర్తించారు. మృతులు మహబూబాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు. తీవ్రంగా గాయపడింది పెనుగొండ మంజుష, శ్రీలతలుగా గుర్తించారు. ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీలత మృతి చెందింది. మంజుష పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్త చేస్తున్నారు.