YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

బీసీ జాబితా నుంచి తొలగించిన 26 బీసీ కులాలను వెంటనే చేర్చాలి

బీసీ జాబితా నుంచి తొలగించిన 26 బీసీ కులాలను వెంటనే చేర్చాలి

బీసీ జాబితా నుంచి తొలగించిన 26 బీసీ కులాలను వెంటనే చేర్చాలి
హైదరాబాద్ సెప్టెంబర్ 19 
బీసీ జాబితా నుంచి తొలగించిన 26 బీసీ కులాలను వెంటనే బీసీ జాబితాలో వెంటనే చేర్చుకోవాలని 26 కులాల జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ రోజు బీసీ భవన్ లో ఆర్ కృష్ణయ్య నాయకత్వంలో సంఘం సమావేశమై, ఈ కులాలను వెంటనే కలపడానికి జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి తగు ఆదేశాలు ఇవ్వాలని త్వరలో జాతీయ బీసీ కమిషన్ కు ఫిర్యాదు చేయాలని, తొలగించిన 26 బిసి కుల  సంఘాల రాష్ట్ర నాయకులు నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి శేట్టిబలిజ, తూర్పు కాపు, పోలినాటి వెలమ, కొప్పుల వెలమ, కళింగ, పొందర, నాగవంశ,  తూర్పు కాపు, గవర కుల సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కులాలను బి.సి జాబితా నుంచి తొలగించడం రాజ్యాంగ విరుద్దం. న్యాయ విరుద్దమని కృష్ణయ్య అన్నారు.ఏదైనా కులాన్ని బి.సి జాబితాలో కలుపాలన్న – తొలగించాలన్న బి.సి కమీషన్ సిఫార్సుల ప్రకారం చేయాలి. కాని ఇందుకు విరుద్దంగా బి సి కమీషన్ సిఫార్సులు లేకుండా 26 కులాలను ఏక పక్షంగా కక్ష్య పూరితంగా తొలగించారు. ఐదు సంవత్సరాలుగా వీరు  ఆన్ని సౌకర్యాలు కోల్పోయారు. రిజర్వేషన్లు కోల్పోతున్నారు. ఉద్యోగాలు కోల్పోతున్నారు. స్కాలర్ షిప్ లు-ఫీజులు రావడం లేదు. హాస్టల్ సీట్లు – రెసిడెన్షియల్ పాటశాలల సీట్లు ఇవ్వడం లేదని కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కులాలను తొలగించే అధికారం ముఖ్యమంత్రికి గాని,  రాష్ట ప్రభుత్వానికి గాని లేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, రాజ్యాంగ ప్రకారం ఏదైనా తొలగించాలన్న లేదా కలుపాలన్న బి.సి కమీషన్ ద్వారా మాత్రమే చేయాలి. 42 సం. రాలుగా బి.సి సౌకర్యాలు, రాయితీలు – రిజర్వేషన్లు పొందిన ఈ కులాలను అర్థాంతరంగా తొలగిస్తే వీరి గతి ఏం కావాలి ?తొలగించిన కులాలవారు కోర్టుల చుట్టూ తిరుగడానికే సమయమంతా వృదా అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కులాల వారు చిత్ర – విచిత్రమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తల్లి – దండ్రులు బి సి కోటా క్రింద చదివారు. బి.సి కోటా క్రింద ఉద్యోగం పొందారు. కాని పిల్లలకు బి .సి కోట ఇవ్వడంలేదు. ఇంకొక విచిత్ర మేమిటంటే విద్యార్థులుగా బి.సి కోట క్రింద 2014 వరకు చదివారు. 2015 నుంచి ఓసీ గా మార్చారు. ఇంకా విచిత్ర మేమిటంటే బి.సి కోటా క్రింది చదివారు. కాని ఉద్యోగంకు వచ్చే సరికి బి.సి కోటా ఇవ్వడంలేదు. 
ఇంకో విచిత్ర మేమిటంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఐఏఎస్ ,ఐపిఎస్, ఉద్యోగాలు పొందుతున్నారు. కేంద్ర విద్యా సంస్థలలో అడ్మిషన్లు పొందుతున్నారు. కేంద్ర ఉద్యోగాలలో బి సి జాబితాలో యుండి బ్యాంకు, రైల్వే ఇతర ఉద్యోగాలు పొందుతున్నారు.  కాని రాష్ట్రంలో బి.సి జాబితాలో లేదనందువల్ల ఈ సదుపాయాలు పొందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Related Posts