YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ఆత్మజ్ఞానము

ఆత్మజ్ఞానము

ఆత్మజ్ఞానము
ఆత్మజ్ఞానము తెలుసుకొనుట ప్రతి మనిషికి అవసరము. ఆత్మజ్ఞానం అంటే ఏమిటి?
మనము జన్మించక ముందు ఏమై ఉన్నాము?
మరణానంతరము ఏమవుతాము? మన ఆత్మ  ఎక్కడ ఎక్కడకు  ప్రయాణం చేస్తుంది? ఈ జన్మల బంధముల నుండి విముక్తి పొందడం ఎలా? అనగా జన్మరాహిత్యం ఎలపొందగలము?  జన్మరాహిత్యము పొంది, కైవల్య ప్రాప్తి పొందుటకు ప్రస్తుత జీవితములో మనము ఏమి చేయవలెను? మనలోని చక్రములు ఏమిటి?  దేహములు ఏమిటి?  కర్మ సిద్ధాంతము మన జీవితాలకు ఎలా అన్వయించ బడుతుంది.  ఇంకను ఇలాంటి అనేక ఆసక్తికరమైన, అలౌకికమైన విషయముల సమాహారమే  ఆత్మ జ్ఞానము. ఆత్మజ్ఞానం ఎందుకు తెలుసుకోవాలి? దీని వలన ఉపయోగం ఏమిటి?
 పుట్టిన ప్రతి మనిషి  తప్పక ఆత్మజ్ఞానము తెలుసుకుని తీరవలెను. ఎందుకంటే ఎటువంటి  సామాజిక జ్ఞానమైనా  జీవి చనిపోగానే అతనితోనే అంతరించిపోతుంది. కానీ ఒక జీవి  పరమాత్మను చేరువరకు  అవసరమైనది ఆత్మజ్ఞానం. మానవ జన్మ  ఉద్దేశ్యము ఇహ పరమైన కార్యక్రమములు కాదు. పరమాత్మను చేరి కైవల్యము పొందుటయే. కానీ మానవులు ఇది తెలుసుకోలేక దైనందిన కార్యక్రమంలో, సంసార లంపటం లో చిక్కుకొని పరమాత్మ వైపు చూడలేకపోతున్నారు.
మానసిక ప్రశాంతత కలుగును ఒత్తిడి తగ్గును
రుగ్మతల నుండి ఉపశమనం కలుగును  పరమాత్మకు చేరువగుట జరుగును.
ఆత్మజ్ఞానమును తెలుసుకోకుండానే చాలామంది తమ జీవితములను ముగించు చున్నారు. ఒక్క మానవ జన్మ లో మాత్రమే ఆత్మజ్ఞానమును తెలుసుకొను అవకాశము కలదు. ఇతర ఏ జన్మలోనూ మనము తెలుసుకోలేము. ఏ జీవికి ఈ అవకాశం లేదు. మరల మరల జన్మలు ఎత్తుతూ ఉండవలెను.  కర్మలను అనుభవించుచూ కొట్టుమిట్టాడుతుండవలెను. మానవునకు మేధాశక్తి కలదు. ప్రజ్ఞా శక్తి కలదు. ఏ ఇతర జీవికీ లేని  విచక్షణ కలదు. కనుకనే ప్రపంచాన్నంతటినీ  వశమచేసుకుంటున్నాడు.
కానీ తనను తాను తెలుసుకోలేకపోతున్నాడు. ఎంత మేధాశక్తి ఉన్నా ఆత్మజ్ఞానము తెలుసుకోకుండా చనిపోయినచో ఏమి ప్రయోజనము. ఇతర జీవులకు మానవునికి తేడా ఏమున్నది. కనుక ఉచితముగా అత్మజ్ఞానము తెలుసుకుని మీ జీవితములను  సాఫల్యము చేసుకోండి. జన్మ రహిత్యమును  చేసుకొని, కైవల్య ప్రాప్తి పొందండి.
శుభం భూయాత్
 

Related Posts